Skip to content

వైవిధ్యమైన పాత్రలకు కేరాఫ్‌ అడ్రస్‌గా శివాజీ

ప్రేక్షకులు నటుడిగా తనకు ఇచ్చిన గుర్తింపును బాధ్యతగా ఫీలయ్యి, వాళ్లను వైవిధ్యమైన పాత్రలతో, కంటెంట్‌ ఉన్న సినిమాలతో
ఎంటర్‌టైన్‌ చేయడమే లక్ష్యంగా సినిమాలు చేసే నటులు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి అరుదైన నటుల్లో శివాజీ ముందు వరుసలో ఉంటారు.. నటుడిగా, హీరోగా ఎన్నో విలక్షణమైన పాత్రలు పోషించారు. కామెడీ, ఎమోషన్, ఫ్యామిలీ, యాక్షన్ ఇలా అన్ని రకాల కథలతో ఆడియెన్స్‌ని ఆయన ఆకట్టుకున్నారు. అయితే సినిమాలకి కాస్త గ్యాప్ ఇచ్చిన ఆయన బిగ్ బాస్ షోతో మళ్లీ కెరీర్‌ను ప్రారంభించారు. బిగ్ బాస్ షోతో శివాజీ ప్రతీ ఇంటి గడపలోకి, తెలుగు వారి మనసుల్లో మళ్లీ స్థానాన్ని సంపాదించుకున్నారు.

బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన శివాజీకి ఎన్నో అవకాశాలు తలుపు తట్టాయి. అయితే శివాజీ మాత్రం అచితూచి అడుగులు వేయాలని నిర్ణయించుకున్నాడు. తనకు నచ్చిన, మెచ్చిన కథల్ని ఎంచుకుంటున్నారు. శివాజీ ఓ కథను ఒప్పుకున్నారంటే ఆ సినిమాను తప్పకుండా చూడాల్సిందే అనేలా ప్రేక్షకుల్లో నమ్మకాన్ని ఏర్పర్చుకున్నారు. శివాజీ ఓ మూవీ చేస్తున్నాడంటే.. అందులో కంటెంట్ ఎంతో గొప్పగా ఉంటుందనే పేరు తెచ్చుకున్నారు. అందుకే ఆయన సెకండ్ ఇన్నింగ్స్‌లో చేసిన ‘కోర్ట్’, ‘దండోరా’ చిత్రాలకు అవార్డులు వచ్చాయి.
సినిమా సినిమాకు వైవిధ్యమైన పాత్రలను చేస్తూ ఆడియన్స్‌ను అలరిస్తున్నాడు. ఇటీవల విడుదలైన ‘లెనిన్‌’ చిత్రంలో యతిరాజులుగా తన నటవిశ్వరూపం చూపించాడు. 90స్‌ అనే ఈటీవీ విన్‌ ఓటీటీ వెబ్‌సీరిస్‌తో సెకండ్‌ ఇన్నింగ్స్‌ను ప్రారంభించి విభిన్నమైన పాత్రలతో అలరిస్తున్నాడు. త్వరలో ఆయన నటించిన ‘ఎపిక్’ అనే మూవీ వస్తున్న సంగతి తెలిసిందే. అందులోనూ శివాజీ మధ్య తరగతి తండ్రిగా తన నటనతో అందరినీ ఆకట్టుకోబోతోన్నారు. ఇవే కాకుండా ఇతర భాష నుంచి కూడా శివాజీకి ఆఫర్లు వస్తున్నాయి.ప్రస్తుతం శివాజీకి మరికొన్ని క్రేజీ ప్రాజెక్ట్‌లు లైనప్‌లో ఉన్నాయి. అల్లరి నరేష్‌ సినిమాతో పాటు తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతోన్న ప్రదీప్‌ రంగనాథన్‌ సినిమా, కళ్యాణ్‌ చక్రవర్తి సినిమాతో పాటు మరికొన్ని క్రేజీ ప్రాజెక్టులతో శివాజీ బిజీగా ఉన్నారు. త్వరలోనే తెలుగు ప్రేక్షకులు శివాజీ మరిన్ని మంచి పాత్రల్లో చూడబోతున్నారు. ఇందులో ఎటువంటి సందేహం లేదు.

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.