వైవిధ్యమైన పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా శివాజీ
ప్రేక్షకులు నటుడిగా తనకు ఇచ్చిన గుర్తింపును బాధ్యతగా ఫీలయ్యి, వాళ్లను వైవిధ్యమైన పాత్రలతో, కంటెంట్ ఉన్న సినిమాలతో ఎంటర్‌టైన్ చేయడమే లక్ష్యంగా సినిమాలు చేసే నటులు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి అరుదైన నటుల్లో శివాజీ ముందు వరుసలో ఉంటారు.. నటుడిగా, హీరోగా ఎన్నో విలక్షణమైన పాత్రలు పోషించారు. కామెడీ, ఎమోషన్, ఫ్యామిలీ, యాక్షన్ ఇలా అన్ని రకాల కథలతో ఆడియెన్స్‌ని ఆయన ఆకట్టుకున్నారు. అయితే సినిమాలకి కాస్త గ్యాప్ ఇచ్చిన ఆయన బిగ్ బాస్ షోతో మళ్లీ కెరీర్‌ను ప్రారంభించారు. బిగ్ బాస్ షోతో శివాజీ ప్రతీ ఇంటి గడపలోకి, తెలుగు వారి మనసుల్లో మళ్లీ స్థానాన్ని సంపాదించుకున్నారు. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన శివాజీకి ఎన్నో అవకాశాలు తలుపు…
