Skip to content

‘మిర్జాపూర్: ది మూవీ’ టీజర్ విడుదల

దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ప్రముఖ ఫ్రాంచైజీ “మిర్జాపూర్ : ది మూవీ” టీజర్ విడుదలైంది. ఓటీటీ ప్రపంచంలో సంచలనం సృష్టించిన మిర్జాపూర్ కథ ఇప్పుడు తొలిసారిగా భారీ స్థాయిలో థియేటర్లలోకి రానుంది.

2018లో ప్రారంభమైన మిర్జాపూర్ కథా ప్రయాణాన్ని కొనసాగిస్తూ, ఈ సినిమా కొత్త మరియు ఆసక్తికరమైన కథతో ప్రేక్షకుల ముందుకు రానుంది. సెప్టెంబర్ 4, 2026న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

టీజర్‌లో అలీ ఫజల్, పంకజ్ త్రిపాఠి దివ్యేందు తమ పాత్రలతో మరోసారి కనిపించగా, అభిమానుల అభిమాన పాత్ర బబ్లు పండిట్‌గా జితేంద్ర కుమార్ కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అలాగే రవి కిషన్ కొత్త పాత్రలో చేరి కథకు మరింత బలం చేకూర్చారు.

ఇక అభిషేక్ బెనర్జీ, రసిక దుగల్, శ్వేత త్రిపాఠి Abhishek తదితర ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

అమెజాన్ ఎంజిఎం స్టూడియోస్, ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి గుర్మీట్ సింగ్ దర్శకత్వం వహించగా, పునీత్ కృష్ణ కథను అందించారు. రితేష్ సిద్వానీ, ఫర్హాన్ అక్తర్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

‘మిర్జాపూర్: ది మూవీ’ హిందీతో పాటు తెలుగులో కూడా విడుదల కానుండటం విశేషం. అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం థియేటర్లలో భారీ అనుభూతిని అందించేందుకు సిద్ధమవుతోంది.

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.