రామ్ చరణ్ ‘పెద్ది’ నుంచి బిగ్గెస్ట్ మాస్ సాంగ్ ‘హల్లల్లల్లో’ రిలీజ్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మోస్ట్ అవైటెడ్ రూరల్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ అంచనాలను సృష్టించింది. ఇటీవల విడుదలైన పవర్‌ఫుల్ ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పిస్తున్నారు. రగ్డ్ యాక్షన్, బలమైన ఎమోషన్స్, భారీ కాన్వాస్‌తో రూపొందిన గొప్ప సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందించబోతుంది. ఈ చిత్రానికి సంగీత దిగ్గజం ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు చార్ట్‌బస్టర్స్‌గా నిలవగా, తాజాగా మూడో సింగిల్ ‘హల్లల్లల్లో’ కూడా అదే జోరును కొనసాగిస్తోంది. భోపాల్‌లో నిర్వహించిన…
