‘ఆకాశంలో ఒక తార’ మూవీ నుంచి ‘చిట్టి చిట్టి చీమ’ రిలీజ్
వెర్సటైల్ స్టార్ దుల్కర్ సల్మాన్ పుట్టినరోజు సందర్భంగా ‘ఆకాశంలో ఒక తార’ చిత్ర యూనిట్ ఈరోజు (మంగళవారం) ఫస్ట్ సింగిల్ ‘చిట్టి చిట్టి చీమ’ను విడుదల చేసింది. జివి ప్రకాష్ కుమార్ స్వరపరిచిన ‘చిట్టి చిట్టి చీమ’ పాట హృదయాన్ని హత్తుకునే మెలోడి.. భావోద్వేగంగా సినిమాలో ఏం చెప్పాలనుకున్నారో ఆ పాయింట్‌ను అద్భుతంగా ప్రతిబింబిస్తుంది. హీరోయిన్ కోణంలో పాడిన ఈ పాట, నక్షత్రాలను చేరాలనే ఒక మహిళ కలను, ఆమె పక్కన నిలబడి నిశ్శబ్దంగా అండగా నిలిచే వ్యక్తి ప్రేమను చూపిస్తుంది. సాంప్రదాయ ప్రేమకథలను దాటి, ఒక ప్రత్యేకమైన బంధాన్ని ఈ పాట అందంగా సెలబ్రేట్ చేస్తుంది. శ్రీమణి రాసిన ఈ పాటను రమ్య బెహరా ఎంతో చక్కగా ఆలపించారు. చిట్టి చీమ…
