‘అలియాస్ రుక్మిణి’ నుంచి రుక్మిణిగా ఆఫియా సయ్యద్ ఫస్ట్ లుక్ రిలీజ్
బ్లాక్‌బస్టర్ సక్సెస్ 'కోర్ట్ – స్టేట్ వర్సెస్ ఎ నోబడీ' తర్వాత న్యాచురల్ స్టార్ నాని యునానిమస్ ప్రొడక్షన్స్ మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్తో రాబోతోంది. 'అలియాస్ రుక్మిణి' అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నితిన్ హీరోగా నటిస్తుండగా, 'దండోరా' ఫేమ్ మురళీకాంత్ దేవసోత్ దర్శకత్వం వహిస్తున్నారు. దీప్తి గంటా నిర్మిస్తున్న 'అలియాస్ రుక్మిణి' ఒక విలక్షణమైన కథనంతో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌గా రూపుదిద్దుకుంటోంది. తాజాగా ఈ సినిమాలో నితిన్ సరసన కథానాయికగా బాలీవుడ్ నటి ఆఫియా సయ్యద్‌ను మేకర్స్ అధికారికంగా పరిచయం చేశారు. ఈ గ్లింప్స్‌లో రుక్మిణి ఓ స్కూల్ టీచర్‌గా కనిపిస్తుంది. ఆమెను విద్యార్థులు ‘డెవిల్’, ‘హిట్లర్’, ‘హోంవర్క్ పోలీస్’ వంటి పేర్లతో పిలుచుకుంటుంటారు. కోపంగా బోర్డుపై తన పేరు రాస్తూ,…
