భారీ స్థాయి సినిమాలతో అలరించే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కి చెందిన లెజెండరీ జానపద…
‘అలియాస్ రుక్మిణి’ నుంచి రుక్మిణిగా ఆఫియా సయ్యద్ ఫస్ట్ లుక్ రిలీజ్
బ్లాక్‌బస్టర్ సక్సెస్ ‘కోర్ట్ – స్టేట్ వర్సెస్ ఎ నోబడీ’ తర్వాత న్యాచురల్ స్టార్ నాని యునానిమస్ ప్రొడక్షన్స్ మరో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో రాబోతోంది. ‘అలియాస్ రుక్మిణి’ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నితిన్ హీరోగా నటిస్తుండగా, ‘దండోరా’ ఫేమ్ మురళీకాంత్ దేవసోత్ దర్శకత్వం వహిస్తున్నారు. దీప్తి గంటా నిర్మిస్తున్న ‘అలియాస్ రుక్మిణి’ ఒక విలక్షణమైన కథనంతో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌గా రూపుదిద్దుకుంటోంది.
తాజాగా ఈ సినిమాలో నితిన్ సరసన కథానాయికగా బాలీవుడ్ నటి ఆఫియా సయ్యద్‌ను మేకర్స్ అధికారికంగా పరిచయం చేశారు. ఈ గ్లింప్స్‌లో రుక్మిణి ఓ స్కూల్ టీచర్‌గా కనిపిస్తుంది. ఆమెను విద్యార్థులు ‘డెవిల్’, ‘హిట్లర్’, ‘హోంవర్క్ పోలీస్’ వంటి పేర్లతో పిలుచుకుంటుంటారు. కోపంగా బోర్డుపై తన పేరు రాస్తూ, ఆ తర్వాత విద్యార్థుల వైపు ఇంటెన్స్ గా చూసే రుక్మిణి పాత్రను ఈ గ్లింప్స్ పరిచయం చేస్తోంది.
కమాండింగ్, ఆరోగెంట్ బిహేవియర్ రుక్మిణి పాత్రలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. అందంగా కనిపిస్తూనే, ఆరోగెన్స్ తో కూడిన రుక్మిణి పాత్రకు ఆఫియా సయ్యద్ చక్కగా సరిపోయారు. ఈ గ్లింప్స్‌లో ఆమె లుక్, అభినయం ఆకట్టుకుంటున్నాయి.
ఇప్పటికే విడుదలైన ఈ సినిమా గ్లింప్స్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. దానికి వచ్చిన పాజిటివ్ రెస్పాన్స్‌తో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. ప్రేమకథా అంశాలతో పాటు ఆసక్తికరమైన ప్రధాన సంఘర్షణతో కూడిన కథలో నితిన్‌ను సరికొత్త అవతార్‌లో చూపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌కు కూడా మంచి స్పందన వచ్చింది.
ఈ చిత్రానికి జోమోన్ టీ. జాన్ ఐఎస్‌సీ డీవోపీ అందిస్తుండగా, విజయ్ బుల్గానిన్ సంగీతం సమకూరుస్తున్నారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్, సృజన అడుసుమిల్లి ఎడిటింగ్.
షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో పాటు, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా కొనసాగుతున్నాయి. ఈ చిత్రాన్ని డిసెంబర్ 4న విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు.
తారాగణం: నితిన్, ఆఫియా సయ్యద్, సాయికుమార్, హర్షవర్ధన్.
సాంకేతిక సిబ్బంది:
సమర్పణ: నేచురల్ స్టార్ నాని
ప్రొడక్షన్ బ్యానర్: యూనానిమస్ ప్రొడక్షన్స్
రచన, దర్శకత్వం: మురళీ కాంత్ దేవసోత్
నిర్మాత: దీప్తి గంటా
సినిమాటోగ్రఫీ: జోమోన్ T. జాన్ ISC
సంగీతం: విజయ్ బుల్గానిన్
ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా
ఎడిటర్: సృజన అడుసుమిల్లి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ప్రశాంత్ మండవ
కాస్ట్యూమ్ డిజైనర్: రేఖ బొగ్గర్రపు
పబ్లిసిటీ డిజైనర్: భరణిధరన్
మార్కెటింగ్: ఫస్ట్ షో
PRO: వంశీ-శేఖర్

