ఏఐ ఫీచర్ ఫిల్మ్‌గా రాబోతున్న ‘అంబ’s రివెంజ్’
▪️తెలుగు సినీ పరిశ్రమలో తొలి పూర్తి స్థాయి AI మూవీ ▪️విడుదలకు సిద్ధమవుతూ ప్రచార పర్వం ప్రారంభం హైదరాబాద్: తెలుగు సినీ పరిశ్రమలో సాంకేతిక విప్లవానికి నాంది పలుకుతూ 'అంబ’s రివెంజ్' చిత్రం ముస్తాబవుతోంది. నక్క తోక ఫిలిమ్స్ బ్యానర్‌పై యోగేంద్ర పొట్లూరి, రాణి మాడిసన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, జయవర్ధన్ మడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి ఏఐ విజువల్ డిజైన్ & డెవలప్మెంట్ను 'కాలై విజువల్ స్టూడియోస్' అందిస్తోంది. పూర్తి స్థాయి కృత్రిమ మేధ (ఏఐ) సహకారంతో రూపొందుతున్న తొలి తెలుగు ఫీచర్ ఫిల్మ్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీ ప్రచార కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. భారత ఇతిహాసమైన మహాభారతంలోని శక్తివంతమైన పాత్ర అంబ స్ఫూర్తితో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. పురాణ…
