‘డాయ్రా’ మూవీ ట్రైలర్ విడుదల
- జంగ్లీ పిక్చర్స్, డాక్టర్ జయంతీలాల్ గడా (పెన్ స్టూడియోస్) సంయుక్తంగా నిర్మిస్తోన్న ‘డాయ్రా’ చిత్రంలో ప్రధాన పాత్రధారులుగా కరీనా కపూర్ ఖాన్, పృథ్వీరాజ్ సుకుమారన్ ‘డాయ్రా’ మూవీ ట్రైలర్ విడుదలైంది. నిజం ఎప్పుడూ ఒకేలా ఉండదని, న్యాయం ఎవరి కోణంలో వారు ఎలా అర్థం చేసుకుంటారనేదానిపై ఆధారపడి ఉంటుందని, ప్రతి నిర్ణయం వెనుక ఓ ఘటన ఉంటుందనే అంశాలను ఈమూవీ ట్రైలర్లో ఆసక్తికరంగా చూపించారు. సెప్టెంబర్ 18, 2026న థియేటర్లలో విడుదల కానున్న ఈ చిత్రానికి మేఘనా గుల్జార్ దర్శకత్వం వహించారు. క్రైమ్, న్యాయం, శిక్ష వంటి అంశాలను భావోద్వేగభరితంగా, ఉత్కంఠభరితంగా, విభిన్న కోణాలతో చెప్పే ప్రయత్నం చేశారు. ఈ కథను యష్ కేస్వానీ, సీమా అగర్వాల్, మేఘనా గుల్జార్ కలిసి…
