‘నాగబంధం’ నుంచి లీలావతిగా అనసూయ లుక్ రిలీజ్
అభిషేక్ నామా దర్శకత్వంలో, విరాట్ కర్ణా నటించిన 'నాగబంధం: ది సీక్రెట్ ట్రెజర్' చిత్రం జూలై 3న థియేటర్లలో ఘనంగా విడుదల కాబోతున్న నేపథ్యంలో అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. ప్రతీ అప్‌డేట్‌తో ఈ చిత్రంపై బజ్ నెక్స్ట్ లెవల్ కి చేరుతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, గ్లింప్స్, సాంగ్స్ సినిమాపై మ్యాసీవ్ బజ్ క్రియేట్ చేశాయి. తాజాగా మేకర్స్ ‘నాగబంధం’ సినిమా నుంచి అనసూయ భరద్వాజ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ‘లీలావతి’ పాత్రలో ఆమె లుక్ పవర్‌ఫుల్‌గా, మిస్టీరియస్‌గా కనిపిస్తోంది. సంప్రదాయ తెలుపు చీరలో, ట్రైబల్ జ్యువెలరీతో అనసూయ కనిపించిన తీరు పాత్రలోని తీవ్రతను ప్రతిబింబిస్తోంది. లీలావతి పాత్ర కథలో ఎంతో కీలకంగా ఉండబోతోందనే ఫీల్ ఈ పోస్టర్‌తోనే స్పష్టమవుతోంది. ఈ…
