Skip to content

శ్రుతి హాసన్ హీరోయిన్‌గా కొత్త సినిమా అనౌన్స్‌మెంట్

విభిన్నమైన కథలు, క్వాలిటీ సినిమాలను ప్రేక్షకులకు అందిస్తున్న నిర్మాణ సంస్థ శాంతి టాకీస్ తమ కొత్త సినిమాను అధికారికంగా ప్రకటించింది. అరుణ్ విశ్వ నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటించనున్నారు. విమర్శకుల ప్రశంసలు అందుకున్న హారర్ థ్రిల్లర్ ‘అశ్విన్స్’తో గుర్తింపు తెచ్చుకున్న తరుణ్ తేజ ఈ సినిమాకు కథ అందించడంతో పాటు దర్శకత్వం వహించనున్నారు. శివకార్తికేయన్ హీరోగా మడోన్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ‘మావీరన్’, సిద్ధార్థ్ హీరోగా శ్రీ గణేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘3బీహెచ్‌కే’ వంటి సినిమాలతో శాంతి టాకీస్ విభిన్నమైన కథలను, కొత్త తరహా సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ను ప్రేక్షకులకు అందిస్తోంది. ఇదే ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఇప్పుడు మరో ఆసక్తికరమైన కాంబినేషన్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. తమిళ, తెలుగు,…

Read more