Skip to content

పంచమహాశక్తుల నేపథ్యంలో ‘ఆది రుద్రాక్ష’

హైదరాబాద్: పంచమహాశక్తులు, మహారహస్యం, దుష్టశక్తుల మధ్య జరిగే పోరాటం నేపథ్యంలో తెరకెక్కుతున్న పౌరాణిక యాక్షన్ థ్రిల్లర్ ‘ఆది రుద్రాక్ష’. షేక్ మహబూబ్ బాషా నిర్మాణంలో, ఆర్యన్ హీరోగా నటిస్తూ రచన, దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా తొలి గ్లిమ్స్‌ను హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో విడుదల చేశారు. సినిమా గ్లిమ్స్‌లో వినిపించిన వాయిస్ ఓవర్ ఆసక్తికరంగా సాగింది. నాగ, గజ, వ్యాఘ్ర, మయూర తదితర శక్తుల ప్రస్తావనతో పాటు, యుగయుగాలుగా ఓ మహారహస్యానికి రక్షణగా నిలిచిన పంచరక్షకుల కథను పరిచయం చేశారు. ఆ రహస్యాన్ని చేజిక్కించుకోవడానికి ప్రయత్నించే దుష్టశక్తులు, వాటిని ఎదుర్కొనే మహావీరుడి నేపథ్యంలో కథ సాగనున్నట్లు గ్లిమ్స్ ద్వారా వెల్లడించారు. మహాదేవుని సంకల్పానికి ప్రతిరూపంగా ఓ వీరుడు రణరంగంలోకి అడుగుపెట్టే సన్నివేశాలు ఆకట్టుకున్నాయి…

Read more