నవంబర్ 6 నుండి హిందీ జీ5లో స్ట్రీమింగ్ కానున్న”లాస్ట్ మ్యాన్ ఇన్ టవర్”
అభివృద్ధి చెందుతోన్న నగరంతో పాటు ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. ఎంత మారినా కూడా కొన్నింటిని వదులుకోవడం మాత్రం అంత సులభం కాదు. ముఖ్యంగా మనకు ఎంతో అనుబంధం ఉన్న ఇంటిని వదిలిపెట్టడం మరింత కష్టం. ఇలాంటి ఆసక్తికరమైన కథాంశంతో తెరకెక్కిన చిత్రమే ‘లాస్ట్ మ్యాన్ ఇన్ టవర్’. మనోజ్ బాజ్‌పాయ్, బోమన్ ఇరానీ, దివ్య దత్తా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఓ రిటైర్డ్ టీచర్ చుట్టూ తిరుగుతుంది. ముంబైలోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివసించే ఆయన.. ఆ భవనాన్ని పునర్నిర్మించేందుకు (రీడెవలప్‌మెంట్) భారీ మొత్తంలో డబ్బు ఇస్తామన్న ఆఫర్ వచ్చినా ఇల్లు ఖాళీ చేయడానికి అంగీకరించడు. తనకు ఎంతో ఇష్టమైన ఇంటిని కాపాడుకోవడం కోసం ఏకంగా ఆ హౌసింగ్ సొసైటీలోని…
