నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ
ఆంధ్రప్రదేశ్ నంది అవార్డులకు సంబంధించిన కీలక ప్రకటనను ఆంధ్రప్రదేశ్ ఎఫ్డిసి చైర్మన్ భారత భూషణ్ గారు, ఆంధ్రప్రదేశ్ ఎఫ్డిసి ఎండి విశ్వనాథన్ గారు నేడు ప్రకటించడం జరిగింది. గత కొద్ది సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆగిపోయిన నంది అవార్డుల కార్యక్రమానికి సంబంధించిన కొన్ని విషయాలను మీడియా వేదికగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భారత భూషణ్ గారు మాట్లాడుతూ... "ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ హృదయపూర్వక నమస్కారం. ఎంతో కాలం నుండి తెలుగు సినీ, టీవీ, నాటక రంగాలు ఎప్పటి నుండో ఎదురుచూస్తున్న ఇన్ని సంవత్సరాల నంది అవార్డులు ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్…
