#RN23 అనౌన్స్మెంట్
కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలకు ప్రాధాన్యం ఇచ్చే రోహిత్ నారా, కరణ్ సి ప్రొడక్షన్స్ LLPతో తన తదుపరి ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించారు. ఈ బ్యానర్ లో ప్రతిష్టాత్మకమైన 5వ ప్రొడక్షన్ గా రూపొందుతున్న #RN23 కంప్లీట్ రొమాంటిక్ కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఈ ప్రాజెక్ట్‌ను భరత్ చౌదరి నిర్మిస్తుండగా, చినిమిల్లి మణికుమార్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఆయనే కథ, స్క్రీన్‌ప్లే కూడా అందిస్తున్నారు. యూనివర్సల్ ఎమోషన్స్‌తో కూడిన కొత్త కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే ఆసక్తి నెలకొంది. "షౌటింగ్ సూన్" అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్‌తో ఉన్న అనౌన్స్మెంట్ పోస్టర్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా హాస్యం, ప్రేమ, భావోద్వేగాలు, కుటుంబ అనుబంధాలను కలగలిపిన వినోదాత్మక కథతో…
