‘హుషారు పిట్టలు’ చిత్రం నుంచి ‘మంగళస్నానం’ లిరికల్ సాంగ్ విడుదల
అన్షు, వాసవి గణేషన్ జంటగా రూపొందుతోన్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ చిత్రం 'హుషారు పిట్టలు'. పద్మ అమ్మ, బీవీజీ స్టూడియెస్ సమర్పణలో రుద్ర క్రాంతి పిక్చర్స్ పతాకంపై వెంకట్ యాదవ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి బిక్షు దర్శకుడు. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థలు ఏషియన్ సురేష్ ఫిలింస్ సంస్థలు విడుదల చేస్తున్నాయి. ఇటీవల విడుదల చేసిన ఈ చిత్రం టీజర్‌కు అనూహ్యమైన స్పందన వచ్చింది. కాగా ఈ చిత్రం నుంచి తాజాగా మంగళస్నానం అనే హార్ట్ టచ్చింగ్ ఎమోషనల్ సాంగ్‌ను విడుదల చేశారు. ఓ తండ్రి తన కూతురును ఎంత అల్లారు ముద్దుగా పెంచుకుంటాడో, ఆమెపై ప్రాణాలు పెట్టుకుని ఎలా ఉంటాడో ఈ పాటలో తెలుస్తుంది. తండ్రి కూతుళ్ల అనుబంధంతో…
