Skip to content

సల్మాన్ ఖాన్, వంశీ పైడిపల్లి, దిల్ రాజు చిత్రం అనౌన్స్‌మెంట్

సల్మాన్ ఖాన్, వంశీ పైడిపల్లి, దిల్ రాజు చిత్రం  అనౌన్స్‌మెంట్ Telugu News
సల్మాన్ ఖాన్, వంశీ పైడిపల్లి, దిల్ రాజు చిత్రం  అనౌన్స్‌మెంట్ Telugu News

సినీ ఇండస్ట్రీలో ఒక్కసారిగా సంచలనం రేపిన ఈ భారీ అనౌన్స్మెంట్ ను సల్మాన్ ఖాన్, వంశీ పైడిపల్లి, దిల్ రాజు సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రం వచ్చే నెలలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది.

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్, బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ వంశీ పైడిపల్లి, ప్రతిష్టాత్మక శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సక్సెస్ ఫుల్ నిర్మాత దిల్ రాజు కలసి హై ఆక్టేన్ యాక్షన్ డ్రామా చేయబోతున్నారు. ఈ హై పవర్డ్ కొలాబరేషన్ అనౌన్స్‌మెంట్ అభిమానులు, పరిశ్రమలో హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. ఈ త్రయం ఈ ప్రాజెక్ట్‌ను సోషల్ మీడియాలో అనౌన్స్ చేశారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ 2027లో బిగ్గెస్ట్ సినిమా ఈవెంట్‌లలో ఒకటిగా నిలుస్తోంది, ఈ చిత్రం ఏప్రిల్‌లో సెట్స్ పైకి వెళ్లనుంది.

బిగ్ స్కేల్ ఎంటర్‌టైనర్స్‌ను ఎమోషన్స్ తో మేళవిస్తూ చిత్రాలను రూపొందించే దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు వంశీ పైడిపల్లి. ప్రభాస్, ఎన్టీఆర్, మహేష్ బాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్, విజయ్ వంటి అగ్ర హీరోలతో పని చేసి, విభిన్న జానర్స్ లో తన ప్రతిభను నిరూపించుకున్నారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘మహర్షి’ జాతీయ అవార్డు సాధించడం ఆయన విజన్ కి నిదర్శనం.

దిల్ రాజు తన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై మరో భారీ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుడుతున్నారు. 60కి పైగా చిత్రాలను నిర్మించిన ఆయన, కంటెంట్, కమర్షియల్ విజయాలతో సక్సెస్ ఫుల్ గా నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు. ‘మహర్షి’, ‘శతమానం భవతి’ చిత్రాలకు జాతీయ అవార్డులు అందుకోవడం ఆయన క్యాలిటీకి నిదర్శనం.

ఈ ప్రాజెక్ట్ ద్వారా సల్మాన్ ఖాన్ తొలిసారి వంశీ పైడిపల్లి – దిల్ రాజుతో కలిసి పని చేయబోతున్నారు. మూడు దశాబ్దాల కెరీర్‌లో సల్మాన్ ఖాన్ దబాంగ్, బాడీగార్డ్, రెడీ టు కిక్, బజరంగీ భాయిజాన్, సుల్తాన్, ఐకానిక్ టైగర్ ఫ్రాంచైజీ వంటి అనేక బ్లాక్‌బస్టర్ చిత్రాలతో భారీ విజయాలు సాధించారు.

వంశీ పైడిపల్లి – దిల్ రాజు కాంబినేషన్ ఇప్పటికే ఐదు విజయవంతమైన చిత్రాలను అందించింది. ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు సల్మాన్ ఖాన్ మ్యాసీవ్ స్క్రీన్ ప్రెజెన్స్, వంశీ పైడిపల్లి స్పెషల్ స్టొరీ టెల్లింగ్, దిల్ రాజు గ్రాండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కలిసిన ఈ సినిమా ప్రేక్షకులకు అద్భుతమైన థియేట్రికల్ అనుభూతిని అందించనుంది.

వచ్చే నెలలో షూటింగ్ ప్రారంభం కానున్న ఈ చిత్రం గురించి మరిన్ని వివరాలను మేకర్స్ త్వరలోనే తెలియజేయనున్నారు.

See also  రామ్ చరణ్ 'పెద్ది' విడుదల వాయిదా — జూన్ 2026 లో థియేటర్లకు | Ram Charan Peddi June Release

నటీనటులు: సల్మాన్ ఖాన్
సాంకేతిక బృందం:
రచన, దర్శకత్వం: వంశీ పైడిపల్లి
నిర్మాత: దిల్ రాజు
బ్యానర్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
PRO: వంశీ-శేఖర్

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.