Skip to content

23 చిత్రాన్ని ఖైదీలకు ప్రదర్శించేందుకు ఏర్పాటు చేస్తాం: జైళ్లశాఖ డైరెక్టర్ జనరల్ సౌమ్య మిశ్రా

23 చిత్రాన్ని ఖైదీలకు ప్రదర్శించేందుకు ఏర్పాటు చేస్తాం:   జైళ్లశాఖ డైరెక్టర్ జనరల్ సౌమ్య మిశ్రా Telugu News

మల్లేశం, మెట్రో 8am వంటి ఆలోచనత్మక సినిమాలను రూపందించిన దర్శకుడు రాజ్ రాచకొండ రూపొందించిన చిత్రం 23(ఇరవై మూడు). నేరస్థుల పరివర్తన, నేరలను తగ్గిస్తుందనే కథంశం తో రూపొందిన ’23’ గతఏడాది విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. విమర్శకుల ప్రశంసలతో పాటు గద్దర్ స్పెషల్ జ్యురీ అవార్డు ను దక్కించుకుంది. ఈ సందర్భంగా చిత్ర బృందానికి జైళ్లశాఖ డైరెక్టర్ జనరల్ సౌమ్య మిశ్రా ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన సభకు ఆమె హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన సభ లో సౌమ్య మిశ్రా మాట్లాడుతూ.. ఈ సినిమా నిర్మాణం అత్యంత బాధ్యత తోనూ, కష్టం తోనూ కూడుకున్నది. ఈ సినిమా చూసాను అది చాలా ప్రభావవంతం గా ఉంది. ఈ ప్రయత్నం చేసిన టీం ని అభినందిస్తున్నాను. నేరస్థుల పరివర్తన అనే అంశాలు కథలో బాగా పొందుపరిచారు. జైలు జీవితాలను ఇంత వాస్తవికతం గా తెరమీద ఇప్పటి వరకూ చూపలేదు. ది షాషాంక్ రిడెంప్షన్ వంటి గొప్ప చిత్రాల సరసన నిలబడే చిత్రం 23. ఈ సినిమా ఖచ్చితంగా ఖైదీలకు ప్రదర్శించేందు కు ఏర్పాటు చేస్తాం. కొందరిలో మార్పు వచ్చినా అది ఈ సినిమా సాధించిన గొప్ప విజయం. 23 చిత్రం తెలంగాణ గద్దర్ స్పెషల్ జ్యూరీ అవార్డు గెలుచుకున్నందుకు అభినందనలు.

దర్శకుడు రాజ్ మాట్లాడుతూ.. ఈ ప్రయాణం లో తోడు ఉన్న టీం కి కృతజ్ఞతలు. ఈ సినిమా ప్రయాణం చాలా ప్రత్యేకం. గద్దర్ అవార్డ్స్ జ్యురీ కి థాంక్స్. ఈ నిర్మించిన ప్రయోజనం నెరవేరాలంటే జైళ్ళలో ఈ ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వంని కోరుకుంటున్నాను.

దర్శకుడు బి. నర్సింగ రావు.. 23 వంటి సినిమా లను ప్రభుత్వం ప్రోత్సహం ఇవ్వాలి. మాభూమి, దాసి వంటి వాస్తవికత దృక్పధం ఉన్న సినిమాలు తర్వాత ఆ పరంపర కొనసాగలేదు. ఇప్పుడు 23వంటి సినిమాలు వస్తునందుకు ఆనందం గా ఉంది.

డా. బీనా మాట్లాడుతూ.. “23” సినిమాలో జైలు రీఫార్మ్ ప్రోగ్రామ్‌ను చేర్చేందుకు దర్శకుడు రాజ్ ఎంతో పట్టుదలగా ప్రయత్నించారు. ప్రతి ఖైదీ కథ కూడా ఒక సినిమా కథలాంటిదే. తెలంగాణ, తిహార్ జైళ్లలో రీఫార్మ్ కార్యక్రమాలను నిర్వహించిన ప్రొఫెసర్ బీనా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, న్యాయవాదులు కలిసి చలపతి రావు వంటి ఖైదీలకు సహాయం చేయాలని కోరారు.

సిద్దోజి మాట్లాడుతూ.. సినిమాలు కూడా సున్నితమైన అంశాలను స్పృశించగలవని రాజ్ నిరూపించారు. “23” తెలుగు సినిమాల్లో ఎవరూ తాకని విషయాన్ని ధైర్యంగా ప్రస్తావించిన అరుదైన చిత్రం.

See also  'విష్ణు విన్యాసం' మంచి సెలబ్రేషన్ లాంటి సినిమా - శ్రీ విష్ణు

భరద్వాజ మాట్లాడుతూ.. చిలకలూరిపేట బస్సు దహనం ఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ కేసులో ఉన్న నిందితుల కథనే సినిమా చూపిస్తుంది. ఆ నేరం ఉద్దేశపూర్వకంగా చేయబడింది కాదు. కానీ ఉద్దేశపూర్వకంగా హత్యలు చేసిన అనేక మంది విడుదలైనప్పటికీ, ఈ కేసులో ఉన్నవారికి ఇప్పటికీ ఉపశమనం లభించలేదు. వారిని విడుదల చేయాలని ప్రభుత్వం, సమాజాన్ని కోరారు.

ఈ కార్యక్రమం లో డా.బీనా చింతలపురి, డా. సిద్దోజీ రావు, నటుడు తాగుబోతు రమేష్, రచయిత భరద్వాజ్ పాల్గొన్నారు.

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.