Skip to content

నటి హేమకు క్లీన్ చీట్

నటి హేమకు క్లీన్ చీట్ Telugu News
నటి హేమకు క్లీన్ చీట్ Telugu News

▪️డ్రగ్స్ కేసులో తీవ్రంగా మానసికంగా క్రుంగిపోయాను
▪️ ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రముఖ నటి హేమతో “మీట్ ది ప్రెస్”

తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటి హేమ కు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కమెడియన్‌గా ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన ఆమె, తన సహజమైన నటనతో ప్రత్యేక గుర్తింపు పొందారు. అదే సమయంలో నేరుగా, బహిరంగంగా తన అభిప్రాయాలను చెప్పే స్వభావం వల్ల కూడా తరచూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. టాలీవుడ్‌లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కమెడియన్‌గా దశాబ్దాల పాటు తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి హేమ ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రముఖ నటి హేమతో నిర్వహించిన “మీట్ ది ప్రెస్” కార్యక్రమం హైదరాబాద్‌లోని తెలుగు ఫిలిం ఛాంబర్‌లో సోమవారంనాడు జరిగింది. ఈ సందర్భంగా ఇటీవల నటి హేమకు క్లీన్ చీట్ వచ్చింది. తనపై నమోదైన డ్రగ్స్ కేసు, దాని వల్ల తన కుటుంబం ఎదుర్కొన్న ఇబ్బందులు, మీడియా పాత్ర వంటి అంశాలపై భావోద్వేగంగా స్పందించారు.

తెలుగు ఫిలిం ఛాంబర్ లో ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో నటి హేమ మాట్లాడుతూ…. డ్రగ్స్ కేసులో తనపై వచ్చిన ఆరోపణలు తనను తీవ్రంగా మానసికంగా కలచివేశాయని చెప్పారు. “ఆ సమయంలో నేను చచ్చిపోవాలనిపించింది. అంతగా మానసికంగా కుంగిపోయాను” అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తాను ఎలాంటి తప్పు చేయలేదని, అందుకే చివరకు నిర్దోషిగా బయటకు వచ్చానని స్పష్టం చేశారు.

డ్రగ్స్ వ్యవహారంలో కొందరు మీడియా సంస్థలు తనపై నిరాధార ఆరోపణలు చేస్తూ బురదజల్లాయని ఆమె ఆరోపించారు. ఆ వార్తల కారణంగా తన వ్యక్తిగత జీవితం మాత్రమే కాకుండా కుటుంబ సభ్యులు కూడా తీవ్రంగా బాధపడ్డారని చెప్పారు. “నా కుటుంబం చాలా సఫర్ అయింది. మాకు ఇది చాలా కఠినమైన కాలం” అని ఆమె పేర్కొన్నారు. అయితే మొత్తం మీడియాను ఒకే తాటిపై వేయలేమని, నిజాయితీగా వ్యవహరించే మీడియా సంస్థలు తనకు మద్దతుగా నిలుస్తాయని తాను నమ్ముతున్నానని హేమ తెలిపారు. భవిష్యత్తులో కూడా మీడియా తనకు న్యాయం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అధ్యక్షులు బత్తుల ప్రసాద్ రావు మాట్లాడుతూ… మీడియా విషయంలో నటి హేమ ఆవేదనతో ఉన్నారు. తన మనసులోని మాటను పంచుకునేందుకు ఈరోజు ఫిలిం చేసిన మీట్ ది ప్రెస్ కు ఆహ్వానించాము. ఆమె అభిప్రాయాలను మీడియా ముఖంగా పంచుకునే వేదిక ఇది. హేమ చెబుతున్నట్టు, ఆమెనే కాదు, మేము జర్నలిస్టులం కూడా వివక్ష ఎదుర్కొన్నాం.” అని ఆయన అన్నారు.

See also  వేణు ఉడుగుల చేతుల మీదుగా ‘సింగిల్ రాజు’ మూవీ టైటిల్, గ్లింప్స్ విడుదల

ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు ప్రభు మాట్లాడుతూ… చిత్ర పరిశ్రమతో మీడియా ఎప్పుడూ స్నేహపూర్వకంగానే ఉంటూ వచ్చింది. ఈ మధ్య సోషల్ మీడియాల వల్ల కొన్ని తప్పుడు వార్తలు ప్రచారం అవుతున్నాయి. హేమ తన నిర్దోషిత్వాన్ని కోర్టులో నిరూపించుకుంది. కాబట్టి ఈ విషయాన్ని గతంలో ఆమె ఆరోపణలు ఎదుర్కొంటున్న సమయంలో ఎవరైతే ఆమెపై బురద చల్లారో. తిరిగి ఆమెకు కోర్టులో ఊరట లభించినప్పుడు మీడియావారు ఎవ్వరూ కూడా ఆమెపై సానుకూలంగా స్పందించలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఫిలిం క్రిటిక్స్‌ ఆధ్వర్యంలో మీట్ ది ప్రెస్ కార్యక్రమం ద్వారా తన మనసులోని మాటను చెప్పుకునేందుకు వచ్చారు.” అని అన్నారు.

ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సురేష్ కొండేటి మాట్లాడుతూ… నటి హేమ ఎన్నో రకాల పాత్రలు పోషించారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో అనేక పదవులు నిర్వహించారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా, ముఖ్యంగా మహిళలకు ఇబ్బంది కలిగితే వారికి ఎప్పుడూ కూడా ఆమె తన సపోర్టును ఇచ్చారు. ఎంతో ధైర్యంతో ప్రతీ విషయంలోనూ ముందుకు దూసుకుపోతారు. కొన్ని సందర్భాల్లో ఆమె ధైర్యాన్ని చూసి నేను ఆశ్చర్యపోయేవాడిని. అంతటి ధైర్యం గల హేమగారు కూడా కొన్ని సందర్భాల్లో కుమిలిపోవలసి వచ్చింది. కొన్ని తప్పుడు వార్తల వల్ల ఆమె తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. డ్రగ్స్ కేసు నుంచి నిర్దోషిగా బయటకు వచ్చి సంతోషంగా ఉన్నారు. అని అన్నారు. ఆ విషయాన్ని మన ఫిలిం క్రిటిక్స్‌ అసోసియేషన్‌ వేదికగా తన ఆనందాన్ని.. ఆవేదనను పంచుకోవడానికి వచ్చారని అన్నారు.

ఈ మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పలువురు ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ సభ్యులు, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం సందర్భంగా హేమ తనపై వచ్చిన వివాదాలపై వివరణ ఇవ్వడంతో పాటు, తాను ఎదుర్కొన్న అనుభవాలను పంచుకున్నారు.

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.