నాదనీరాజనం కళాబృందాల ఎంపిక కమిటీ సమావేశం
తిరుపతిలోని ఎస్‌వీబీసీ ఛానెల్ కార్యాలయంలో మంగళవారం నాదనీరాజనం కార్యక్రమంలో ప్రదర్శనలు ఇచ్చే కళాబృందాల ఎంపిక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి టీటీడీ ఎస్‌వీబీసీ చైర్మన్ శ్రీ బి శ్రీధర్ వర్మ అధ్యక్షత వహించారు. కళా, సాంస్కృతిక రంగాల్లో నిపుణులైన సెలెక్షన్ కమిటీ సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. నాదనీరాజనం కార్యక్రమం కోసం ఎస్‌వీబీసీకి వచ్చిన దరఖాస్తులను కమిటీ పరిశీలించింది. కళాబృందాలు పంపిన వీడియోలను వీక్షించి, వారి ప్రతిభ, ప్రదర్శన స్థాయి, కార్యక్రమానికి అనుకూలతను పరిశీలించారు. అక్టోబర్, నవంబర్ నెలల్లో నాదనీరాజనం కార్యక్రమంలో ప్రదర్శనలు ఇవ్వనున్న కళాబృందాలను కమిటీ ఎంపిక చేసింది. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలు, కళాకారులకు అవసరమైన సౌకర్యాలు కల్పించడం, వివిధ విభాగాల మధ్య సమన్వయం వంటి అంశాలపై కూడా…
