ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ని ‘దట్స్ ది స్పిరిట్..’ అంటూ ప్రశంసించిన సీఎం రేవంత్ రెడ్డి
వరంగల్ లో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు చేయడం అనేది ఆ ప్రాంత వాసుల దశాబ్దాల కల. తాజాగా ఆ కల నెరవేరిన సందర్భంగా వరంగల్ వాసి అయిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. తమ సొంత పట్టణానికి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ రావడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. వరంగల్ ఎయిర్ పోర్ట్ కు రుద్రమ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ (RIA), కాకతీయ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ (KIA) వంటి చారిత్రక పేర్లను సందీప్ రెడ్డి వంగా సూచించారు. ఆయన సూచనకు స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి 'దట్స్ ది స్పిరిట్..' అంటూ ఎక్స్(ట్విట్టర్) లో పోస్ట్ చేశారు. సీఎం స్పందన పట్ల సంతోషాన్ని తెలియజేస్తూ తను…
