ఫహాద్ ఫాజిల్ ‘అసరీరి’ జనవరి 1న రిలీజ్
వెర్సటైల్ యాక్టర్ ఫహాద్ ఫాజిల్ హీరోగా ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ బ్యానర్ నిర్మిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘అసరీరి’. ఈ ప్రెస్టీజియస్ మూవీ ఈ బ్యానర్‌పై రూపొందుతోన్న 32వ చిత్రం. వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ లిమిటెడ్..మాన్‌సూన్ మూవీస్ అసోసియేషన్‌లో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. డాక్టర్ ఇషారి కె. గణేష్ నిర్మాత. విలక్షణ కథా చిత్రాల దర్శకుడు సి. ప్రేమ్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. జనవరి 1, 2027న నూతన సంవత్సర కానుకగా ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో భారీ ఎత్తున విడుదల చేయటానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. డాక్టర్ ఇషారి కె. గణేష్ నేతృత్వంలో ఎప్పటికప్పుడు వైవిధ్యమైన, భారీ ప్రాజెక్టులను ప్రేక్షకులకు అందించే వేల్స్…
