Skip to content

‘హుషారు పిట్టలు’ రియలిస్టిక్‌గా అనిపించే యూత్‌ఫుల్‌ చిత్రం టీజర్‌ ఆవిష్కరణలో ప్రముఖ నిర్మాత డి.సురేష్‌బాబు

అన్షు, వాసవి గణేషన్‌ జంటగా రూపొందుతోన్న యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రం 'హుషారు పిట్టలు'. పద్మ అమ్మ, బీవీజీ స్టూడియెస్‌ సమర్పణలో రుద్ర క్రాంతి పిక్చర్స్‌ పతాకంపై వెంకట్‌ యాదవ్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి బిక్షు దర్శకుడు. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థలు ఏషియన్‌ సురేష్‌ ఫిలింస్‌ సంస్థలు విడుదల చేస్తున్నాయి. కాగా ఈ చిత్రం టీజర్‌ను ప్రముఖ నిర్మాత డి.సురేష్‌బాబు విడుదల చేశారు. ప్రముఖ నిర్మాత డి.సురేష్‌ బాబు మాట్లాడుతూ '' నిర్మాత బెక్కం వేణుగోపాల్‌ ''హుషారు పిట్టలు' సినిమా గురించి చెప్పాడు. సినిమా చూడగానే వెరీ రియలిస్టిక్‌ యంగ్‌స్టర్‌ సినిమా అనిపించింది. నేటి యువతరం కనెక్ట్‌ అయ్యే సినిమా ఇది. సినిమాలో నటీనటులు అందరూ బాగా చేశారు…

Read more

‘గరివిడి లక్ష్మి’గా ఆనంది ఫస్ట్ లుక్ రిలీజ్

ఇంటెన్స్ స్క్రీన్ ప్రెజెన్స్ ఆకట్టుకునే ఆనంది తన అప్ కమింగ్ మూవీ ‘గరివిడి లక్ష్మి’లో అద్భుతమైన పాత్రలో కనిపించనుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టిజి విశ్వ ప్రసాద్, టిజి కృతి ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఒక డీప్ కల్చర్ ని ప్రజెంట్ చేయబోతోంది. అర్థవంతమైన సినిమాలని రూపొందించడంలో పేరుపొందిన ఈ నిర్మాణ సంస్థ ఇటీవలే ఉత్తరాంధ్ర సంప్రదాయాలను అందంగా చూపిస్తూ జానపదం ‘నల జిలకర మొగ్గ’తో అందరి మనసులు గెలుచుకుంది. ఇప్పుడు మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఆనందిని లెజెండరీ ‘గరివిడి లక్ష్మి’ పాత్రలో పరిచయం చేశారు. హాఫ్ శారీ ధరించి, రిక్షాలో కూర్చున్న ఆనంది, ఒడిలో సంగీత వాయిద్యం హార్మోనియంతో చిరునవ్వుతో కనిపించడం ఆకట్టుకుంది…

Read more