‘చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ యూఎస్ఏ ’తో వినోదాన్ని గ్లోబల్ స్థాయికి తీసుకెళ్తున్న ఆహా
‘చెఫ్ మంత్ర ప్రాజెక్టు యూఎస్ఏ ’తో తెలుగు వినోదాన్ని భౌగోళిక సరిహద్దులను దాటి విస్తరిస్తోంది ఆహా. తొలి తెలుగు అంతర్జాతీయ నాన్-ఫిక్షన్ షోగా రూపొందిన ఈ కార్యక్రమం ప్రస్తుతం ఆహాలో ప్రసారం అవుతోంది. అమెరికా నేపథ్యంలో తెరకెక్కిన ఈ షోలో యూఎస్ఏకు చెందిన ఐదుగురు కంటెస్టెంట్లు పాల్గొంటున్నారు. ఫుడ్, కల్చర్, ఎంటర్టైన్మెంట్, ఎమోషన్, కలగలిపిన ఈ కార్యక్రమం భారత్‌లోని తెలుగు ప్రేక్షకులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారిని ఆకట్టుకునేలా రూపొందించబడింది. 'చెఫ్ మంత్ర ప్రాజెక్టు యూఎస్ఏ ’లో ప్రధానంగా అమెరికాలో తెలుగు వంటకాలు, వాటి ప్రత్యేకతను సెలబ్రేట్ చేస్తున్నారు. మనకు సుపరిచితమైన రుచులు, వంటకాల సంప్రదాయాలను అంతర్జాతీయ వేదికపై పరిచయం చేస్తోంది. యూఎస్ఏకు చెందిన ఐదుగురు కంటెస్టెంట్లను పార్టిసిపేట్ చేస్తూ, ఫుడ్…
