Skip to content

“జిందగీ ఇన్ టు షేడ్స్”కి ఈ స్థాయి స్పందన ఊహించలేదు!!

-ఫిల్మ్ మేకర్ డాలీ తోమర్ ఓంషీల్ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందిన డాక్యుమెంటరీ “జిందగీ ఇన్ టూ షేడ్స్”తో డాలీ తోమర్ హృదయాన్ని తాకే కథనాన్ని తెరపైకి తీసుకొచ్చారు. డాలీకి సినిమామేకింగ్ అంటే కేవలం వృత్తి కాదు… సర్వస్వం. భావోద్వేగాలు, మానవ సంబంధాల ప్రయాణమే ఆమె సినిమా. ఈ డాక్యుమెంటరీ మొదటి ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా అయిన ఇఫ్తేకర్ షరీఫ్ జీవిత ప్రయాణాన్ని ఆవిష్కరిస్తుంది. రెండు దేశాలు, రెండు సంస్కృతుల మధ్య తన జీవితాన్ని ఎలా అర్థవంతంగా సాగిస్తున్నాడో ఈ చిత్రం చూపిస్తుంది. ఈ ప్రయాణం మొదలైన నగరం కావడంతో హైదరాబాద్‌ను ప్రీమియర్ వేదికగా ఎంచుకున్నారు డాలీ. ఇది ఆయన పుట్టిన గడ్డ, భావోద్వేగాల కేంద్రం, అలాగే ఆయన విజయంతో ముడిపడి ఉన్న…

Read more

సీనియర్ పాత్రికేయురాలు డి.జి. భవానికి మాతృవియోగం!

సాక్షి సినిమా సెక్షన్ ఇన్ఛార్జ్, సీనియర్ పాత్రికేయురాలు డి.జి.భవాని మాతృమూర్తి శ్రీమతి ఉప్పులూరి పూర్ణమ్మ (77) ఈరోజు (డిసెంబర్ 30) మధ్యాహ్నం కన్ను మూశారు. గ్యాస్ సంబంధిత ఇబ్బంది తలెత్తడంతో వెంటనే స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లి, సకాలంలో వైద్యం అందించినా ఫలితం లేకపోయింది. హైదరాబాద్ లోని కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుకు గురై తుదిశ్వాస విడిచారు. విజయవాడ సమీపంలో వణుకూరు వీరి స్వస్థలం. వీరికి ఇద్దరు కుమార్తెలు. అంత్యక్రియలు రేపు (డిసెంబర్ 31) హైదరాబాద్ లో జరుగుతాయి!!

Read more

“బిగ్ బాస్” నాకు ఎంతో ఇచ్చాడు – టాప్ 4 ఫైనలిస్ట్ ఇమ్మాన్యుల్

బిగ్ బాస్ నుంచి తాను ఎంతో నేర్చుకున్నానని పేర్కొన్నాడు ప్రముఖ నటుడు ఇమ్మాన్యుల్. 'జబర్దస్త్'తో కోట్లాదిమంది అభిమానాన్ని దండిగా గెలుచుకున్న ఇమ్మాన్యుల్.... బిగ్ బాస్ లోనూ తనదైన శైలిలో అలరించి టాప్ 4 ఫైనలిస్ట్ గా నిలిచాడు. ఈ సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించాడు. బిగ్ బాస్ అనుభవాన్ని తాను ఎప్పటికీ గుండెల్లో పెట్టుకుంటానని పేర్కొన్న ఇమ్మాన్యుల్... అందులో తనతో పాల్గొన్న సహ పార్టిసిపెంట్స్ తో తన అనుబంధాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించాడు. ముఖ్యంగా సంజనాతో తనకు ఏర్పడిన ప్రత్యేక అనుబంధం జీవితాంతం ఉంటుందని తెలిపాడు!! బిగ్ బాస్ లో ప్రతి ఒక్కరూ నటిస్తారని అందరూ అనుకుంటారని, కానీ గంటల తరబడి, వారాల తరబడి, రోజుల తరబడి నటించగలిగే మహానటులు ఈ ప్రపంచంలో ఎవరూ…

Read more