Skip to content

వీవీ వినాయక్ చేతులమీదుగా కిషోర్ మూవీ మేకర్స్ తొలి సినిమా ప్రారంభం

కిషోర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మాత ఎన్.ఎన్. కిషోర్ నిర్మిస్తున్న తొలి చిత్రం ప్రొడక్షన్ నెంబర్ 1 ఘనంగా ప్రారంభమైంది. బుధవారం ఉదయం హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో సినీ ప్రముఖులు, అతిథుల సమక్షంలో ఈ సినిమా పూజా కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి. వినాయక్, ప్రామిసింగ్ హీరో ఆది సాయికుమార్ ముఖ్య అతిథులుగా విచ్చేయడంతో ప్రారంభోత్సవ వేడుక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వి.వి. వినాయక్ చిత్ర బృందానికి స్క్రిప్ట్ అందజేసి శుభాకాంక్షలు తెలియజేయగా.. ముహూర్తపు షాట్‌కు నిర్మాత ఎన్.ఎన్. కిషోర్ క్లాప్ కొట్టారు. ఆది సాయికుమార్ కెమెరా స్విచ్ ఆన్ చేసి చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలిపారు. ఈ ప్రారంభోత్సవ వేడుకకు ప్రముఖ నిర్మాత మల్కాపురం శివకుమార్, సిద్ధు రెడ్డి,…

Read more