రవితేజ లాంచ్ చేసిన ‘DNK’ ఫన్-ఫిల్డ్ ట్రైలర్
బ్లాక్‌బస్టర్ చిత్రాలను నిర్మించిన పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఇప్పుడు మరో ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్ ‘DNK’తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. మౌళి తనూజ్ ప్రశాంత్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తుండగా, అనిల్ యెర్నేని కో-ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. శ్రీను కంబాల ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ఫస్ట్ సింగిల్‌కు మంచి స్పందన వచ్చింది. నవంబర్ 13న సినిమా థియేటర్లలో విడుదల కానున్న నేపథ్యంలో తాజాగా మాస్ మహారాజా రవితేజ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ఆన్‌లైన్ బెట్టింగ్‌కు అలవాటు పడిన హీరో, ఆన్‌లైన్ లోన్ యాప్‌ల ద్వారా అప్పులు చేయడంతో పాటు తన గర్ల్‌ఫ్రెండ్ దగ్గర…
