‘దొంగ నా కొడుకు’ ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేసే ఫన్ ఎంటర్‌టైనర్: సుష్మితా శెట్టి
పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ సినిమాలతో పాటు కంటెంట్ ఉన్న చిత్రాలను కూడా ప్రోత్సహిస్తోంది. ఈ బ్యానర్‌పై రూపొందుతున్న క్రైమ్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘దొంగ నా కొడుకు’. మౌళి తనూజ్ ప్రశాంత్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాతో శ్రీను కంబాల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్ క్రియేట్ చేసింది. నవంబర్ 13న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ సుష్మితా శెట్టి విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. మీ నేపథ్యం.. సినిమాల్లోకి రావాలనే ఆసక్తి ఎలా కలిగింది? -నేను హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగాను. కాకపోతే మా గ్రాండ్ పేరెంట్స్ కన్నడ నుంచి 40 ఏళ్ల క్రితం…
