“Genz With Siva” పాట విడుదల
ప్రముఖ తెలుగు యాడ్ ఫిల్మ్ మేకర్ యమునా కిషోర్ రూపొందించి, నిర్మించిన భక్తి గీతం “Genz With Siva” విడుదలైంది. ఈ పాటకు యమునా కిషోర్ స్వయంగా గాత్రాన్ని అందించగా, డా. జోస్యభట్ల సంగీతాన్ని సమకూర్చారు. ఈ మ్యూజిక్ వీడియో లో సాండిల్య శ్రీనివాస్ ప్రధాన పాత్రలో నటించారు. కాశీలోని 84 ఘాట్ల పేర్లను, 108 శివ స్తోత్రాలను ఒకే గీతంలో మేళవించడం ఈ పాటలోని ప్రత్యేకత. కాశీ ఆధ్యాత్మిక వైభవాన్ని, శివతత్వాన్ని సంగీత రూపంలో ఆవిష్కరించే వినూత్న ప్రయత్నమిది. నేటి యువతకు శివుడిని మరింత చేరువ చేయాలనే ఆలోచనతో “Genz With Siva” రూపొందించబడింది. కాశీ వీధుల్లో, ఘాట్లలో ఒక యువకుడు చేసే ఆధ్యాత్మిక అన్వేషణను ఈ పాట ఆవిష్కరిస్తుంది. ఆధునిక…
