Skip to content

సుమ చేతుల మీదుగా అమీర్‌పేటలో “వరం” ఫ్లాగ్‌షిప్ స్టోర్ ప్రారంభం

ఫైన్ ఫ్యాషన్ జ్యువెలరీలో ఆధునిక లగ్జరీ అనుభూతిని అందించనున్న VARAM
హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో VARAM తన తొలి ఫ్లాగ్‌షిప్ స్టోర్‌ను నవంబర్ 20, 2026న ఘనంగా ప్రారంభించింది. ప్రముఖ యాంకర్, నటి, నిర్మాత సుమ గారు ఉదయం 10 గంటలకు ఈ స్టోర్‌ను ప్రారంభించారు.
ఆధునిక హంగులతో రూపొందించిన ఈ 1,500 చదరపు అడుగుల స్టోర్‌లో వివిధ రకాల ఫ్యాషన్ జ్యువెలరీ అందుబాటులో ఉన్నాయి. ఇయర్‌రింగ్స్, నెక్లెస్‌లు, రింగ్స్, బ్రేస్‌లెట్స్, హారాలు, వడ్డాణాలు, ప్రత్యేకంగా రూపొందించిన జ్యువెలరీ సెట్స్ వంటి విస్తృత శ్రేణి ఆభరణాలను ఇక్కడ కస్టమర్లు వీక్షించడంతో పాటు ధరించి తమకు నచ్చిన స్టైల్స్‌ను ఎంచుకోవచ్చు.
ఈ సందర్భంగా VARAM వ్యవస్థాపకురాలు, CEO ప్రియాంక వేములూరి మాట్లాడుతూ..
“మా VARAM తొలి స్టోర్‌ను ప్రారంభించడం ఎంతో ప్రత్యేకమైన సందర్భం. మా డిజైన్ ఆలోచనలను, ఆభరణాల నాణ్యతను, ప్రత్యేకతను, వైవిధ్యాన్ని కస్టమర్లు నేరుగా అనుభూతి చెందేలా ఈ స్టోర్‌ను ఏర్పాటు చేశాం. సంప్రదాయ జ్యువెలరీ షోరూమ్‌లా కాకుండా, ప్రతి ఒక్కరూ తమ వ్యక్తిగత అభిరుచికి అనుగుణంగా ఆభరణాలను ఎంచుకుని తమ స్టైల్‌ను వ్యక్తపరిచే ప్రత్యేకమైన ప్రదేశంగా ఈ స్టోర్ ఉండాలని కోరుకున్నాం” అని తెలిపారు.
ప్రారంభోత్సవ ప్రత్యేక ఆఫర్
VARAM స్టోర్‌లో ప్రతి రూ.5,000 విలువైన కొనుగోలుపై ఒక ఉచిత బంగారు నాణెం అందిస్తున్నారు.

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.