‘ఈఎన్ఈ రిపీట్’తో నా కెరీర్లో ఫస్ట్ టైమ్ ఇంత గొప్ప ఎక్స్పీరియన్స్ పొందాను: హీరో విశ్వక్…
“Genz With Siva” పాట విడుదల
ప్రముఖ తెలుగు యాడ్ ఫిల్మ్ మేకర్ యమునా కిషోర్ రూపొందించి, నిర్మించిన భక్తి గీతం “Genz With Siva” విడుదలైంది. ఈ పాటకు యమునా కిషోర్ స్వయంగా గాత్రాన్ని అందించగా, డా. జోస్యభట్ల సంగీతాన్ని సమకూర్చారు. ఈ మ్యూజిక్ వీడియో లో సాండిల్య శ్రీనివాస్ ప్రధాన పాత్రలో నటించారు. కాశీలోని 84 ఘాట్ల పేర్లను, 108 శివ స్తోత్రాలను ఒకే గీతంలో మేళవించడం ఈ పాటలోని ప్రత్యేకత. కాశీ ఆధ్యాత్మిక వైభవాన్ని, శివతత్వాన్ని సంగీత రూపంలో ఆవిష్కరించే వినూత్న ప్రయత్నమిది.
నేటి యువతకు శివుడిని మరింత చేరువ చేయాలనే ఆలోచనతో “Genz With Siva” రూపొందించబడింది. కాశీ వీధుల్లో, ఘాట్లలో ఒక యువకుడు చేసే ఆధ్యాత్మిక అన్వేషణను ఈ పాట ఆవిష్కరిస్తుంది. ఆధునిక తరానికి భక్తిని సరికొత్త అనుభూతిగా పరిచయం చేస్తూ, సంప్రదాయానికి నేటి యువతకు మధ్య ఒక అనుసంధానంగా నిలవాలన్నదే ఈ ప్రయత్నం. ఈ పాట ఇప్పుడు ఆన్లైన్లో అందుబాటులో ఉంది. ప్రతి ఒక్కరూ వీక్షించి, పంచుకొని, మా ఈ ప్రయత్నాన్ని ప్రోత్సహించాలని కోరుకుంటున్నాము.
https://drive.google.com/file/d/1HHC0a_4v6VNlF3NMc0vSuScndF-gf8FJ/view?usp=sharing

