ప్రభాస్ రివిల్ చేసిన ‘రోమియో జూలియట్’ స్టొరీ గ్లింప్స్
హర్షిత్, విశాఖ ధిమాన్ జంటగా నటిస్తున్న యూత్‌ఫుల్ జెన్‌జెడ్ లవ్ డ్రామా ‘రోమియో జూలియట్’. భార్గవ్ మాచర్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వైవా హర్ష, సిరి హనుమంత్, ప్రసాద్ బెహరా, ప్రభాస్ శ్రీను, అజయ్ ఘోష్, అజయ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నవ రస ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సందీప్ ఎన్, వెంకటేశ్వరరావు చల్లగుల్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గడ్డం రాకేష్ రెడ్డి, రుద్రదేవ్ మాడిరెడ్డి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. సాధారణంగా తెలుగు సినిమాలు ఫస్ట్ షో పడే వరకు కథను, కథలోని కీలక అంశాలను సీక్రెట్‌గా ఉంచుతాయి. అయితే ‘రోమియో జూలియట్’ మేకర్స్ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించారు. సినిమా థియేట్రికల్ రిలీజ్‌కు దాదాపు నాలుగు వారాల ముందే.. ఈరోజు చిత్రంలోని…
