Skip to content

‘హై’ నుంచి ప్రమోషనల్ సాంగ్ ‘దమ్ములుంటే’ రిలీజ్

బ్లాక్‌బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడితో కలిసి పనిచేయడంతో పాటు, పలు విజయవంతమైన సినిమాలకు కో-రైటర్‌గా వ్యవహరించి గుర్తింపు తెచ్చుకున్న ఎస్ కృష్ణ ఇప్పుడు దర్శకుడిగా అలరించబోతున్నారు. ‘హై’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్న ఆయన.. ఈ చిత్రానికి రచయితగా, నటుడిగా కూడా తన ప్రతిభను చాటుతున్నారు. సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. హరీష్ పెద్ది, శేఖర్ దివ్వెలతో కలిసి ఈ చిత్రాన్ని సహ నిర్మాతగా నిర్మిస్తున్నారు. ఇమేజ్‌స్పార్క్ ఎంటర్‌టైన్‌మెంట్, మైరా క్రియేషన్స్ బ్యానర్లపై రూపొందుతున్న ‘హై’ భావోద్వేగాలు, ఆసక్తికరమైన డ్రామా, ఎనర్జీతో కూడిన సన్నివేశాలతో ప్రేక్షకులకు ఆకట్టుకునే సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ అందించనుంది. అనన్య శర్మ, ఎస్ కృష్ణ, పల్లవి దొర, కృష్ణ కమల్, సాయి కృష్ణ, రేవంత్ (బుల్లిరాజు) ఈ చిత్రంలో కీలక…

Read more

‘హాయ్’ సెప్టెంబర్ 25 నుంచి తమిళ జీ5లో స్ట్రీమింగ్

నయనతార, కవిన్ ప్రధాన పాత్రధారులుగా నేటితరం ప్రేమ, ఆధునిక సంబంధాలు, సంక్లిష్టతలను ఆసక్తికరంగా ఆవిష్కరించిన‌ చిత్రం భారతదేశంలోని అగ్రశ్రేణి సూపర్‌స్టార్స్‌ నటించిన పలు బ్లాక్‌బస్టర్ చిత్రాలను ప్రేక్షకులకు అందించిన త‌మిళ జీ5 తన విజయ పరంపరను కొనసాగిస్తోంది. ‘జననాయగ‌న్’కు లభించిన అద్భుతమైన స్పందన తర్వాత, ఇప్పుడు నయనతార, కవిన్ నటించిన ‘హాయ్’ చిత్రంతో ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌టానికి సిద్ధ‌మ‌వుతోంది. విభిన్నమైన ప్రేమకథగా తెరకెక్కిన ఈ చిత్రం.. నేటితరం సంబంధాలను సరికొత్త కోణంలో ఆవిష్కరిస్తూ, హృదయాన్ని హత్తుకునే ప్రేమకథగా అలరించనుంది. నయనతార, కవిన్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘హాయ్’ చిత్రం.. నేటితరం సంబంధాలు, ప్రేమను హృదయానికి హత్తుకునేలా, భావోద్వేగంగా ఆవిష్కరిస్తుంది. న‌య‌న్‌, కవిన్ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవగా.. తెరపై వారి కెమిస్ట్రీ కథకు…

Read more

‘హాయ్’ ఆగస్టు 28న గ్రాండ్ రిలీజ్

లేడీ సూపర్ స్టార్ నయనతార, కవిన్ తొలిసారి కలిసి నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'హాయ్' విడుదల తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ఆగస్టు 28న గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. విష్ణు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నయనతార, కవిన్‌తో పాటు కె. భాగ్యరాజ్, ప్రభు, రాధికా శరత్‌కుమార్, వీటీవీ గణేష్, సత్యన్, ఆదిత్య కథిర్, ఖురైషి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రాజేష్ శుక్లా సినిమాటోగ్రఫీ అందించగా, జెన్ మార్టిన్ సంగీతం సమకూర్చారు. ఫిలోమిన్ రాజ్ ఎడిటర్‌గా, ఎస్. కన్నన్ ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు. జీ స్టూడియోస్, ది రౌడీ పిక్చర్స్, సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్లపై నయనతార, విఘ్నేష్ శివన్, ఎస్.ఎస్. లలిత్ కుమార్ ఈ…

Read more

‘హాయ్’ ఆగస్టు 14న వరల్డ్‌వైడ్ గ్రాండ్ రిలీజ్

లేడీ సూపర్ స్టార్ నయనతార, యువ హీరో కవిన్ తొలిసారి జంటగా నటిస్తున్న 'హాయ్' విడుదల తేదీని మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించారు. ప్రత్యేక అనౌన్స్‌మెంట్ వీడియోను విడుదల చేస్తూ ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. నూతన దర్శకుడు విష్ణు ఎడ్విన్ దర్శకత్వం వహిస్తున్నఈ చిత్రంలో కె. భాగ్యరాజ్, ప్రభు, రాధిక శరత్‌కుమార్, వీటీవీ గణేష్, సత్యన్, ఆదిత్య కదిర్, ఖురేషి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి రాజేష్ శుక్లా సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, జెన్ మార్టిన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఫిలోమిన్ రాజ్ ఎడిటర్‌గా, ఎస్. కన్నన్ ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు. జీ స్టూడియోస్, ది రౌడీ పిక్చర్స్, సెవెన్ స్క్రీన్ స్టూడియో…

Read more