Skip to content

“ఎ బ్యూటిఫుల్ బ్రేకప్” 13న విడుదల

*ఇళయరాజా సంగీతం హైలెట్ గా, తెలుగు వారు నిర్మించిన చిత్రం* తక్ష్, మటిల్డా హీరో–హీరోయిన్లుగా నటించిన ఇంగ్లీష్ ఫీచర్ ఫిల్మ్ “ఎ బ్యూటిఫుల్ బ్రేకప్” ఒక ట్రెండ్ సెట్టింగ్ రొమాంటిక్ హారర్ థ్రిల్లర్. ఈ చిత్రాన్ని ప్రతిభావంతుడైన దర్శకుడు అజిత్ వాసన్ ఉగ్గిన రచన, దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని 5 నేచర్స్ మూవీస్ ఇంటర్నేషనల్ సంస్థ నిర్మించగా, ముద్రగడ రంగారావు, ఉగ్గిన సత్యనారాయణరావు సమర్పిస్తున్నారు. పూర్తిగా ఇంగ్లీష్‌లో, గ్లోబల్ ఆడియెన్స్‌ను లక్ష్యంగా రూపొందించిన “ఎ బ్యూటిఫుల్ బ్రేకప్” ఈ నెల 13న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు సిద్ధమవుతోంది. దీనికి ముందుగా 12న దుబాయ్‌లో ఎక్స్‌క్లూజివ్ ప్రీమియర్ నిర్వహించనున్నారు. ఇంగ్లీష్ విడుదల అనంతరం ఈ చిత్రాన్ని హిందీ, తెలుగు, తమిళ,…

Read more

నవంబర్ 8న ఇళయరాజా మ్యూజికల్ లైవ్ కన్సర్ట్

ఇసైఙ్ఞాని ఇళయరాజా సంగీత విభావరి (లైవ్ కన్సర్ట్) పెద్ద ఎత్తున మొదటిసారి ఆంధ్రప్రదేశ్ లో జరగనుంది. విజయవాడ ఎంజి రోడ్ లోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నవంబర్ 8వ తేదీ శనివారం నాడు కనీవినీ ఎరుగని రీతిలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. విజయవాడలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ట్రెండ్ సెట్టర్స్ లైవ్ సుధాకర్ ఈ లైవ్‌ కన్సర్ట్‌ ను నిర్వహిస్తున్నారు. ఈ సంగీత కచ్చేరికి సంబంధించిన పోస్టర్‌ ను ఇసైఙ్ఞాని ఇళయరాజా తో పాటు, ఏపీ ఇండస్ట్రీస్ మినిస్టర్ టీజీ భరత్ విడుదల చేశారు. ఈవెంట్ కు సంబంధించిన టికెట్లను ఇప్పటికే బుక్ మై షో లో పొందుపరచగా మంచి రెస్పాన్స్ దక్కుతోంది. అత్యంత వేగంగా టికెట్లు అమ్ముడు అవుతున్నాయి. ఇంకా లిమిటెడ్ టికెట్స్…

Read more