ఇంద్రా కంపెనీ బ్యానర్ పై కొర్రాల సుబ్బారెడ్డి ‘వాంటెడ్ బాయ్ ఫ్రెండ్’ (వస్తే వదలం) ఫస్ట్ లుక్ లాంచ్
ఇంద్రా కంపెనీ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.4గా, కొర్రాల సుబ్బారెడ్డి కొత్త ప్రయత్నంగా తెరకెక్కుతున్న ‘వాంటెడ్ బాయ్ ఫ్రెండ్ (వస్తే వదలం)’ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ క్రిస్మస్ పండగ సందర్భంగా అంగరంగ వైభవంగా శ్రీనగర్ కాలనీలోని రాంబాబు స్టూడియోలో లాంచ్ అయ్యింది. ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ గారి చేతుల మీదుగా పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా రామ సత్యనారాయణ గారు మాట్లాడుతూ – “క్రిస్మస్ సందర్భంగా సుబ్బారెడ్డి డైరెక్టర్-నిర్మాతగా ఇంద్రా కంపెనీ బ్యానర్‌లో కొత్త సినిమా తీసేందుకు ముందుకు రావడం అభినందనీయం. కొత్త డైరెక్టర్లు, కొత్త ఆర్టిస్టులు ఇండస్ట్రీకి అత్యవసరం. లిటిల్ హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి వంటి చిన్న బడ్జెట్ సినిమాలు పెద్ద హిట్ అయ్యాయి…
