మానవాళికి మత్స్యావతార మహాప్రళయ హెచ్చరిక ఇదుగో..
▪️ప్రపంచ చరిత్రదినోత్సవం సందర్భంగా సంచలన పరిశోధనా ప్రజెంటేషన్ ▪️ "ప్రపంచ మహా జలప్రళయ నాగరికత - మత్స్యావతార నాగరికత"పై కొత్త సిద్ధాంతం ఆవిష్కరణ ▪️ సింధు లోయ నాగరికతపై వినూత్న దృక్కోణం ప్రతిపాదించిన ఇట్స్ సిక్స్‌త్ వావ్ (ITS 6TH WOW) సంస్థ హైదరాబాద్: మానవ నాగరికత చరిత్రలో వేల ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా తరతరాలుగా చెప్పుకుంటూ వస్తున్న మహా జలప్రళయ కథనాల వెనుక ఏదైనా ఉమ్మడి చారిత్రక జ్ఞాపకం దాగి ఉందా? వేదాలలోని మనువు, బైబిల్‌లోని నోవా, ఖురాన్‌లోని నూహ్, మెసొపొటేమియాలోని ఉత్నపిష్టిమ్, జియుసుద్ర, గ్రీకు సంప్రదాయంలోని డ్యూకలియన్ వంటి మహా జలప్రళయ గాథలు ఒకే ప్రాచీన నాగరికతను సూచిస్తున్నాయా? సింధు లోయ నాగరికతలో కనిపించే చేప చిహ్నాలు, జల నిర్వహణ వ్యవస్థలు,…
