శరవేగం గా షూటింగ్ జరుపుకుంటున్న వెంకటేష్, కళ్యాణ్ రామ్, అనిల్ రావిపూడి కాంబో ‘జనవరి 12 విడుదల’
విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ కాంబినేషన్ లో హిట్ మిషన్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న మోస్ట్ అవైటెడ్ మల్టీస్టారర్ ‘జనవరి 12 విడుదల’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, శ్రీమతి అర్చన, జీ స్టూడియోస్ సమర్పిస్తున్నాయి. కీర్తి సురేష్, కృతి శెట్టి కథానాయికలుగా నటిస్తున్నారు. ‘బావ బామ్మర్ది సౌజన్యంతో’ అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫ్యామిలీ ఎమోషన్స్, హ్యూమర్, కమర్షియల్ ఎంటర్టైన్మెంట్తో కంప్లీట్ ప్యాకేజీగా అలరించనుంది. తాజాగా చిత్ర బృందం కజకిస్థాన్‌లో కొత్త షెడ్యూల్‌ను ప్రారంభించింది. ఈ షెడ్యూల్ కోసం దర్శకుడు అనిల్ రావిపూడి యాక్షన్, పాటల కలయికతో ప్రత్యేకమైన ప్లాన్ సిద్ధం చేశారు…
