తలసేమియా రన్‌ను విజయవంతం చేసిన అందరికీ ధన్యవాదాలు: నారా భువనేశ్వరి
ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విశాఖపట్నం ఆర్కే బీచ్‌రోడ్డులో తలసేమియాపై అవగాహన కోసం రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సతీమణి, ఎన్టీఆర్ ట్రస్ట్ మ్యానేజింగ్ ట్రస్టీ శ్రీమతి నారా భువనేశ్వరి ప్రారభించారు. ఒలింపిక్ పతాక విజేత కరణం మల్లేశ్వరి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్, హోం మంత్రి అనిత, ఎన్టీఆర్ ట్రస్ట్ సీఈఓ కే రాజేంద్రకుమార్ తదితర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారీ సంఖ్యలో నగరవాసులు ఉత్సాహంగా పాల్గొని ఈ రన్ ని విజయవంతం చేశారు. అనంతరం రన్ విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ క్రీడాకారులని సత్కరించారు. అనంతరం గ్రాండ్ మ్యూజికల్ నైట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్ట్…
