అల్లరి నరేష్ ‘కనకదుర్గ’ సినిమా నుంచి ‘అమ్మ కనకదుర్గ’ పాటను ఆవిష్కరించిన తమన్
నవరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని బిర్లా స్టూడియోస్, టెంపుల్ టౌన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న భక్తిరస చిత్రం ‘కనకదుర్గ’ నుంచి తొలి పాట ‘అమ్మ కనకదుర్గ’ను విజయవాడలో విడుదల చేశారు. ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ స్వరపరిచిన ఈ పాటను జీ మ్యూజిక్ కంపెనీ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. తమన్ ఎస్ సంగీతం అందించిన ఈ పాటకు సిరాశ్రీ సాహిత్యం అందించారు. కనకదుర్గమ్మ దివ్య అనుగ్రహం, శక్తి, ఆధ్యాత్మిక విశిష్టతను చాటిచెప్పేలా ఈ పాటను రూపొందించారు. భక్తి ప్రధానంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలోని అంతర్లీన భావాన్ని ఈ పాట ఆవిష్కరిస్తోంది. విజయవాడలో ఈ పాటను విడుదల చేయడం వెనుక ప్రత్యేకమైన కారణం ఉంది. శ్రీ కనకదుర్గమ్మవారి ప్రసిద్ధ ఆలయం ఉన్న ఈ నగరానికి అమ్మవారితో…
