Skip to content

‘డాడ్స్ లిటిల్ ఫ్రెండ్’ క్లైమాక్స్ చూసి కంటతడి పెట్టుకుంటున్నారు- హీరో రజత్ రాఘవ్

వెన్నెల సిల్వర్ స్క్రీన్ బ్యానర్ మీద దీపక్ నిర్మాణంలో శరత్ తెరకెక్కించిన చిత్రం ‘డ్యాడ్స్ లిటిల్ ఫ్రెండ్’. ఈ సినిమాలో రజత్ రాఘవ్, కాజల్, హాసిని సుధీర్ హీరో హీరోయిన్లు గా బేబీ పరిణిత రుద్రరాజు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ మూవీ ప్రస్తుతం థియేటర్లో విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ఈ సినిమా సక్సెస్‌లో భాగంగా హీరో రజత్ రాఘవ్ మీడియాతో ముచ్చటించారు. ఆయన చెప్పిన చిత్ర విశేషాలు ఇవే..

సినిమాకి వస్తున్న స్పందన పట్ల మీ అభిప్రాయం ఏంటి?
‘డాడ్స్ లిటిల్ ఫ్రెండ్’ సినిమాకి మంచి స్పందన వస్తోంది. క్లైమాక్స్ చూసి అందరూ ఎమోషనల్ అవుతున్నారు. పిల్లలతో కలిసి అందరూ మూవీని చూస్తున్నారు. మా ప్రమోషన్స్ కన్నా కూడా మా కంటెంట్ ఎక్కువగా మాట్లాడుతోంది. మహిళలు, పిల్లలు ఎక్కువగా మా చిత్రాన్ని ఆదరిస్తున్నారు.

సింగపూర్ బ్యాక్ డ్రాప్ కోసం కష్టపడినట్టుగా కనిపిస్తోంది?
‘డాడ్స్ లిటిల్ ఫ్రెండ్’ అనే కథకి సింగపూర్ బ్యాక్ డ్రాప్‌ని తీసుకున్నాం. కథలో భాగంగానే అది ఉంటుంది. కూతురి కోసం అక్కడి నుంచి తండ్రి ఇక్కడకు వచ్చి ఏం చేశాడు.. అన్న కథ అందరికీ కనెక్ట్ అయింది. ఆ ఇంపాక్ట్ ఇవ్వడం కోసమే సింగపూర్‌లో షూట్ చేశాం. అక్కడే దాదాపు 12 రోజులు షూట్ చేశాం.

కుటుంబ బంధాల్ని గొప్పగా చూపించారనే ప్రశంసలు కూడా వస్తున్నాయి?
ప్రస్తుతం మానవ సంబంధాలు ఎలా ఉంటున్నాయో చూస్తున్నాం. అందరిలోనూ అసహనం, కోపం అనేవి పెరుగుతున్నాయి. కోపాలతో తీసుకునే నిర్ణయాలు జీవితాన్ని ఎలా నాశనం చేస్తాయనే సందేశాన్ని ఇచ్చేలా మా చిత్రం ఉంటుంది.

మీ చిత్రానికి వస్తున్న ప్రశంసలు, ఓపెనింగ్స్ గురించి చెప్పండి?
‘డాడ్స్ లిటిల్ ఫ్రెండ్’కి వస్తున్న ప్రశంసలు, ఓపెనింగ్స్ చూసి సర్ ప్రైజ్ అయ్యాను. నా కెరీర్‌లో ఇదే హయ్యస్ట్ ఓపెనింగ్ తెచ్చిన చిత్రం. షోలు కూడా పెంచుతున్నాం. మహిళలు, పిల్లలు మా సినిమాని ఆదరిస్తున్నారు. అన్ని చోట్లా హౌస్ ఫుల్స్ పడుతున్నాయి. పీవీఆర్‌తో కనెక్ట్ అవ్వడం మాకు కలిసి వచ్చింది.

డైరెక్టర్ శరత్ గురించి చెప్పండి?
శరత్ నాకు మంచి స్నేహితుడు. శరత్ రాసే ప్రతీ కథ నాకు వివరిస్తాడు. ఈ ‘డాడ్స్ లిటిల్ ఫ్రెండ్’ కథ విన్న వెంటనే ఎమోషనల్ అయ్యాను. నిర్మాత దీపక్‌కి కూడా కథ చాలా నచ్చింది. అలా మా ప్రాజెక్ట్ ప్రయాణం మొదలైంది.

థియేటర్లో ఆడియెన్స్ రెస్పాన్స్‌ని ప్రత్యక్షంగా చూసినప్పుడు కలిగిన ఫీలింగ్ ఏంటి?
సిటీలో చాలా వరకు హౌస్ ఫుల్స్ పడ్డాయి. ట్విస్టుల్ని ఎవ్వరూ రివీల్ చేయడం లేదు. క్లైమాక్స్ చూసి అందరూ కంటతడి పెట్టుకుంటున్నారు. అందరూ మా పాత్రలతో కనెక్ట్ అవుతున్నారు. అది చూసినప్పుడు నాకు సంతృప్తి కలిగింది.

నిర్మాత గురించి చెప్పండి?
డైరెక్టర్ శరత్, నాకు, నిర్మాత దీపక్ గారికి ఎంతో ప్రత్యేకమైన సినిమా. నిర్మాత గారు ఈ చిత్రం కోసం ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఖర్చు పెట్టారు. మా మొదటి ప్రాజెక్ట్ ఇలా విజయం సాధించడం ఆనందంగా ఉంది. ప్రస్తుతం మా కంటే ఎక్కువగా మా సినిమానే మాట్లాడుతోంది.

తండ్రి పాత్రను పోషించడం ఎలా అనిపించింది?
‘డాడ్స్ లిటిల్ ఫ్రెండ్’ లాంటి మంచి కథలో తండ్రి పాత్రను పోషించడం సంతోషంగా అనిపించింది. ఈ పాత్రను చాలా ఎంజాయ్ చేశాను.

హీరోయిన్ల పాత్రల గురించి చెప్పండి?
కాజల్ చౌదరి, హాసిని సుధీర్‌లు చక్కగా నటించారు. ఇద్దరూ తెలుగు రాకపోయినా నేర్చుకుని మరీ డైలాగ్స్ చెప్పారు. ఆ ఇద్దరూ మా సినిమాకి కీలకంగా వ్యవహరించారు.

విజయేంద్ర ప్రసాద్ గారి ప్రశంసల గురించి చెప్పండి?
మా టీజర్‌ను విజయేంద్ర ప్రసాద్ గారు లాంచ్ చేశారు. ఇదొక చార్లీ చాప్లిన్ లాంటి చిత్రమని అన్నారు. నవ్వుతూ, ఏడ్పించారని అన్నారు. నవ్వించడం, ఏడ్పించడంలో తండ్రీ కూతుళ్ల పాత్రలు అందరినీ ఆకట్టుకున్నాయి.

నెక్ట్స్ ప్రాజెక్ట్ గురించి చెప్పండి?
ఇదే ప్రొడక్షన్, ఇదే కాంబోలో ఓ సినిమాని కమిట్ అయ్యాను. అది పూర్తి భిన్నంగా ఉంటుంది. ఫుల్ లెంగ్త్ కామెడీ జానర్‌లో సినిమాని ప్లాన్ చేస్తున్నాం

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.