కిరణ్ అబ్బవరం, దేవిక భట్, సుధాకర్ చాగంటి, జాయ్ ఫిల్మ్స్ ‘రియాలిటీ’ నుంచి వెడ్డింగ్ సీజన్…
“సిద్ధుగాడి లవ్ స్టోరీ” సినిమాకు బాగా కనెక్ట్ అవుతున్నారు – డైరెక్టర్ రమేష్ బాబు చెరుకూరు

మనోజ్, శృతి, మోహన సిద్ధి హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా “సిద్ధుగాడి లవ్ స్టోరీ”. ఈ చిత్రాన్ని శివ బ్రహ్మేంద్ర క్రియేషన్స్ పతాకంపై బాల బ్రహ్మచారిచెరుకూరు శివ బ్రహ్మిణి చెరుకూరు సమర్పణలో, నిర్మాత సావిత్రమ్మ చెరుకూరు నిర్మించారు. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన “సిద్ధుగాడి లవ్ స్టోరీ” సినిమా ఈ నెల 27న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వచ్చి యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. ఈ రోజు ఈ చిత్ర సక్సెస్ మీట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వైవి రావు మాట్లాడుతూ – మా సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. మా సినిమాను సక్సెస్ చేసిన ఆడియెన్స్ కు థ్యాంక్స్. అన్నారు.
రైటర్ శ్రీధర్ మాట్లాడుతూ – మా సినిమాకు యూత్ ఆడియెన్స్ బాగా కనెక్ట్ అవుతున్నారు. నైజాం, సీడెడ్, ఆంధ్రా..ఇలా అన్ని ఏరియాస్ లో హిట్ టాక్ వస్తోంది. సాంగ్స్ బాగున్నాయని చెబుతున్నారు. హీరో హీరోయిన్స్ క్యారెక్టర్స్ ను ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తున్నారు. మా చిత్రాన్ని ఇలాగే మరింత సక్సెస్ చేయాలని కోరుతున్నాం. అన్నారు.
హీరోయిన్ శృతి మాట్లాడుతూ – ఈ సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్. రెండు తెలుగు రాష్ట్రాల్లో మా సినిమాకు ఆదరణ లభిస్తోంది. ప్రతి సెంటర్ నుంచి హిట్ టాక్ వస్తోంది. ఇది యూత్ ఓరియెంటెడ్ మూవీ అయినా ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా మా సినిమాను చూస్తున్నారు. మీరు కూడా మీ ఫ్యామిలీతో వెళ్లి మా సినిమా చూడాలని కోరుతున్నా. అన్నారు.
హీరో మనోజ్ మాట్లాడుతూ – మేము మా సినిమాను కష్టపడి రూపొందించాం. మా కష్టానికి తగిన ఫలితాన్నిస్తూ సినిమాను ప్రేక్షకులు పెద్ద హిట్ చేశారు. మేము ఇంతటి రెస్పాన్స్ ను ఊహించలేదు. చూసిన వాళ్లంతా సినిమా బాగుందంటున్నారు. యూత్ ఆడియెన్స్ నేను చేసిన సిద్ధు క్యారెక్టర్ కు బాగా కనెక్ట్ అవుతున్నారు. డ్యాన్స్ , ఫైట్స్ బాగా చేశాననే పేరొస్తోంది. మార్నింగ్ షోస్ కు చాలా మంది వెళ్లారు. ఇప్పుడు ఫస్ట్ షో కు హౌస్ ఫుల్స్ అవుతాయని నమ్ముతున్నాం. మీరు కూడా ఫ్యామిలీతో వెళ్లి చూడండి. సాంగ్స్ బాగున్నాయి. సెకండాఫ్ లో మదర్ సెంటిమెంట్ బాగుందని అంటున్నారు. మీ అందరికీ మా సినిమా నచ్చుతుంది. అన్నారు.
డైరెక్టర్ రమేష్ బాబు చెరుకూరు మాట్లాడుతూ – మా మూవీని ఆడియెన్స్ తో పాటు కలిసి థియేటర్స్ లో చూశాను. మంచి రెస్పాన్స్ వస్తోంది. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ మా సినిమాకు బాగా కనెక్ట్ అవుతున్నారు. ప్రతి ఒక్కరూ మా మూవీని ఎంజాయ్ చేస్తున్నారు. సాంగ్స్ కు అయితే విజిల్స్ కొడుతున్నారు. ఇది నాకు పెద్ద విజయంగా భావిస్తున్నా. నా మొదటి కల సినిమా. అది తీరింది. సినిమా బాగా ఆడుతోంది. ఇంత ఆదరణ ఇస్తారని అంచనా వేయలేదు. ప్రతి సెంటర్ నుంచి మా సినిమాకు మంచి రిపోర్ట్ వస్తోంది. ప్రేక్షకుందరికీ కృతజ్ఞతలు చెబుతున్నా. అన్నారు.
నటీనటులు: మనోజ్, శృతి, మోహన సిద్ధి, సుమన్, సర్కార్, చిత్రం శ్రీను , జబర్దస్త్ అప్పారావు, తదితరులు
టెక్నీషియన్స్
——————————————-
* బ్యానర్: శివ బ్రహ్మేంద్ర క్రియేషన్స్
* సమర్పణ: బాల బ్రహ్మ చారి, శివ బ్రహ్మిణి చెరుకూరు
* నిర్మాత: సావిత్రమ్మ చెరుకూరు
* దర్శకుడు: రమేశ్ బాబు చెరుకూరు
* హీరో: మనోజ్
* హీరోయిన్లు: శృతి , మొహన సిద్ది
* * డి ఓ పి: దొసాడ యాదగిరి
* సంగీత దర్శకుడు: సీ యన్ ఆదిత్యా
* ఎడిటర్: లక్కీ ఎక్కరి
* మేనేజర్: వై వీ రావు
* ఫైట్ మాస్టర్: తూఫాన్
* కొరియోగ్రాఫర్లు: రమేశ్ బాబు చెరుకురు , రజని సాగర్
* ఆర్ట్ డైరెక్టర్: నాని
* పోస్ట్ ప్రొడక్షన్ ః సునీల్ స్టూడియోస్
* మేకప్: వి సాంబశివరావు
* స్టిల్స్: పాము భాను
* ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లు: వి సాంబశివరావు, వేణుగోపాల చారీ చెరుకురు
పీఆర్ఓ – గాండ్ల శ్రీనివాస్

