కిరణ్ అబ్బవరం, దేవిక భట్, సుధాకర్ చాగంటి, జాయ్ ఫిల్మ్స్ ‘రియాలిటీ’ నుంచి వెడ్డింగ్ సీజన్…
దర్శక-నిర్మాత వేణు ఊడుగులకు మహాకవి జాషువా పురస్కారం
దర్శకుడిగా, నిర్మాతగా, రచయితగా టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేకమైన ప్రయాణం కొనసాగిస్తున్నారు వేణు ఊడుగుల. ఆయన కృషిని గుర్తిస్తూ ఖమ్మంలోని జాషువా సాహిత్య వేదిక మహాకవి జాషువా పురస్కారాన్ని అందించింది. మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ వేణు ఊడుగులకు ఈ పురస్కారం ప్రదానం చేశారు. ఈ కార్యక్రమం జాషువా సాహిత్య వేదిక అధ్యక్షుడు మువ్వా శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగింది.
ఈ కార్యక్రమంలో కొమ్మవరపు విల్సన్రావు రచించిన జాషువా పద్య శిల్పం, ప్రభలత, డప్పొల్ల రమేష్ సంపాదకత్వంలో వెలువడిన గుగ్గిలం పుస్తకాలను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా దర్శక, నిర్మాత వేణు ఊడుగుల తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. తన రచనలతో సమజాన్ని చైతన్య పరచిన మహాకవి జాషువా పేరిట నెలకొల్పన పురస్కారం తనకు దక్కడం గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు.



