కిరణ్ అబ్బవరం, దేవిక భట్, సుధాకర్ చాగంటి, జాయ్ ఫిల్మ్స్ ‘రియాలిటీ’ నుంచి వెడ్డింగ్ సీజన్…
“నీరో” సినిమా విజయాన్ని మనమంతా చూడబోతున్నాం – డైరెక్టర్ బోయపాటి శ్రీను

అరవింద్, అర్చన అయ్యర్, హారిక నారాయణ్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా “నీరో”. ఈ చిత్రాన్ని గోల్డ్ మౌంటెన్ క్రియేషన్స్ ఎల్ఎల్పీ బ్యానర్ పై అనురాగ్ పర్వతనేని నిర్మిస్తున్నారు. డైరెక్టర్ కల్యాణ చక్రవర్తి త్రిపురనేని రూపొందిస్తున్నారు. ఈ సినిమా గ్లింప్స్ లాంఛ్ ఈవెంట్ ఈ రోజు హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా
సినిమాటోగ్రాఫర్ సి.రామ్ ప్రసాద్ మాట్లాడుతూ – ఈ చిత్రానికి పనిచేయడం హ్యాపీగా ఉంది. డైరెక్టర్ కల్యాణ్ చాలా బాగా మూవీ రూపొందించాడు. అనురాగ్, మిగిలిన టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్. అన్నారు.
నటుడు రాజా మాట్లాడుతూ -మా సినిమాను సపోర్ట్ చేసేందుకు వచ్చిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. మీ అందరి బ్లెస్సింగ్స్ మాతో ఉంటాయని నమ్ముతున్నాం. అన్నారు.
నటుడు రఘు కుంచె మాట్లాడుతూ – ఇదే మొదటి ప్రెస్ మీట్ కాబట్టి ఎక్కువగా మాట్లాడను. వచ్చే ఈవెంట్స్ లో మాట్లాడుతా. మా టీమ్ అందరికీ నా విశెస్ అందిస్తున్నా. అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ ఓషో వెంకట్ మాట్లాడుతూ – మీరు మా మూవీ గ్లింప్స్ చూశారు. ఎలా ఉందో మీరే చెప్పాలి. ఈ చిత్రానికి వర్క్ చేయడాన్ని ఎంజాయ్ చేశాను. ఈ అవకాశం కల్పించిన మా డైరెక్టర్, ప్రొడ్యూసర్ కు థ్యాంక్స్. అన్నారు.
హీరోయిన్ హారిక నారాయణ్ మాట్లాడుతూ – ఫస్ట్ టైమ్ నన్ను స్క్రీన్ మీద చూసుకోవడం కొత్తగా ఉంది. నేను ఈ క్యారెక్టర్ చేయగలను అని డైరెక్టర్ కల్యాణ్ నమ్మారు. ఈ ప్రాజెక్ట్ లో భాగమవడం సంతోషంగా ఉంది. వచ్చే ఈవెంట్స్ లో మరిన్ని విశేషాలు మీతో షేర్ చేసుకుంటాను. అన్నారు.
నటుడు శివాజి మాట్లాడుతూ – నీరో మూవీతో జర్నీ చేయడం మంచి ఎక్సిపీరియన్స్ ఇచ్చింది. ప్రేమ కథల్లో కొత్త నెరేటివ్ ఉన్న స్క్రిప్ట్ ఇది. ఒక కొత్త హీరోను పరిచయం చేస్తూ కొత్త డైరెక్టర్ సినిమా చేయడం ఛాలెంజ్. కల్యాణ్ బోయపాటి గారి దగ్గర చాలా మూవీస్ కు వర్క్ చేశారు. ఇది ఆయనకు మొదటి చిత్రమైనా బాగా రూపొందించారు. నా క్యారెక్టర్ కు మంచి పేరొస్తుంది. ప్రతి ఒక్కరి పాత్రను కొత్తగా తీర్చిదిద్దారు మా డైరెక్టర్. ఈ మూవీతో అనురాగ్ గారు అభిరుచి గల నిర్మాతగా పేరు తెచ్చుకుంటారు. ఎప్పుడు రిలీజైనా మంచి బజ్ క్రియేట్ చేసే చిత్రమిది. అన్నారు.
హీరోయిన్ అర్చన అయ్యర్ మాట్లాడుతూ – మీ అందరికీ మా మూవీ గ్లింప్స్ నచ్చిందని నమ్ముతున్నాను. ఈ సినిమాలో నేను తీక్షణ అనే క్యారెక్టర్ చేశాను. మీరు గ్లింప్స్ లో చూసినట్లు నా క్యారెక్టర్ కొత్తగా ఉంటుంది. అందరికీ ఇలాంటి క్యారెక్టర్ లభించదు. హీరో అరవింద్ తో కలిసి వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. మీ అందరి లవ్ మా మూవీ టీమ్ కు ఇస్తారని కోరుకుంటున్నా. అన్నారు.
ప్రొడ్యూసర్ అనురాగ్ పర్వతనేని మాట్లాడుతూ – నేను ప్రొడ్యూసర్ గా లాంఛ్ అవుతున్నప్పుడు మీలో చాలా మంది ఫోన్స్ చేసి విష్ చేశారు. మా బ్యానర్ లో సినిమా ప్రయత్నాల్లో ఉన్నప్పుడు కల్యాణ్ చక్రవర్తి గారు కథ చెప్పారు. ఆయన 150కి పైగా పాటలు, 9 సినిమాలకు స్క్రిప్ట్ రాశారు. ఈ కథ విన్నప్పుడు వావ్ అనిపించింది. ఈ కథ వదులుకోకూడదు అని ప్రొడక్షన్ స్టార్ట్ చేశాం. ఇదొక స్టార్ హీరో చేయాల్సిన సినిమా. మీరు గ్లింప్స్ చూస్తున్నప్పుడు అదే ఫీల్ కలిగి ఉంటుంది. స్టార్స్ కోసం వెతికే కంటే మనకున్న వనరుల్లో మంచి సినిమా చేస్తే అరవింద్ స్టార్ అవుతాడని నమ్మాను. మేము చేసేది తొలి ప్రయత్నమైనా బలమైన ప్రయత్నం, బరువైన ప్రయత్నం. మేము ఇప్పటికే 70 శాతం మూవీ కంప్లీట్ చేశాం. మాకు ఎంతగానో సపోర్ట్ చేస్తున్న మా టీమ్ అందరికీ థ్యాంక్స్. అన్నారు.
డైరెక్టర్ కల్యాణ చక్రవర్తి మాట్లాడుతూ – ఈ కథను నేను అనురాగ్ కి చెప్పాను. ఆయన కథ విన్న వెంటనే చాలా ఎగ్జైట్ అయ్యారు. అరవింద్ కూడా కథను బాగా ఇష్టపడ్డారు. ఈ కథలోని సోల్ ను అరవింద్ బాగా అర్థం చేసుకున్నారు. ఈ కథకు ఏం కావాలో తెలుసుకున్నారు. స్క్రిప్ట్ వినగానే అందులోని ఆత్మను అర్థం చేసుకున్నారంటే అరవింద్ మంచి నటుడు అవుతాడని అనిపించింది. నేను పెట్టుకున్న ఆ నమ్మకమే స్క్రీన్ మీద రిఫ్లెక్ట్ అయ్యిందని అనుకుంటున్నా. మేము మా మూవీ గురించి మాట్లాడేకంటే అందులోని విజువల్స్ చెప్పాలని అనుకున్నాం. ఈ జర్నీలో మా టీమ్ అంతా చాలా సపోర్ట్ చేశారు. నీరో కథ మొత్తం వెదికితే కన్నీళ్లు అంటుకోని కాగితాలు ఉంటాయోమో గానీ ప్రేమ అంటుకోని అక్షరాలు ఉండవు. ఇది నా ప్రామిస్. ఇది ప్రేమను నిలబెట్టేందుకు జరిగే ఒక విధ్వంసం. అన్నారు.
హీరో అరవింద్ మాట్లాడుతూ – నేను చిన్నప్పుడు స్కూల్ లో స్టేజీ మీద మాట్లాడాను. మళ్లీ ఇప్పుడే మాట్లాడుతున్నా. ఈ సినిమా ఆఫర్ వచ్చినప్పుడు నేను వేరే కెరీర్ లో ఉన్నాను కదా అనిపించింది. అనురాగ్ గారు నన్ను కలిసినప్పుడు మీరు సినిమాల్లోకి రావాలని అనుకోలేదా అన్నారు. మనం చిన్నప్పటి నుంచి అనుకున్నవి చాలా ఉంటాయి. చేయలేనివి చాలా ఉంటాయి. కల్యాణ్ గారు వచ్చి ఒక రోజు స్టోరీ నెరేట్ చేశారు. కథ మొత్తం ఉత్కంఠగా విన్నాను. ఈ కథను ఆయన ఎంత బలంగా నమ్మారో ఆయన నెరేషన్ లోనే అర్థమైంది. పదాలను ఎంత అందంగా కూర్చి రాస్తారో ఈ కథలో క్యారెక్టర్స్ ను అంత బాగా డిజైన్ చేశారు. ఇందరు టాలెంటెడ్ టెక్నీషియన్స్, ఆర్టిస్ట్స్ తో నా మొదటి సినిమాకు వర్క్ చేస్తున్నందుకు హ్యాపీగా ఉంది. అన్నారు.
డైరెక్టర్ విజయ్ కనకమేడల మాట్లాడుతూ – ఈ సినిమా గ్లింప్స్ నాకు నచ్చింది. టైటిల్ బాగుంది. కొత్త తరహా ప్రేమ కథను చూపించబోతున్నట్లు తెలుస్తోంది. అరవింద్ పర్ ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నారు. ఈ సినిమాకు మంచి టెక్నీషియన్స్ వర్క్ చేశారు. రాంప్రసాద్ గారు కొత్త డైరెక్టర్స్ తో ఆది, అతనొక్కడే వంటి బ్లాక్ బస్టర్స్ మూవీస్ చేశారు. అనురాగ్ గారికి ఈ సినిమా ప్రొడ్యూసర్ గా మంచి పేరు తేవాలని కోరుకుంటున్నా. అన్నారు.
డైరెక్టర్ చందూ మొండేటి మాట్లాడుతూ – ఈ సినిమా విజువల్స్ లోని డీటెయిల్స్ నాకు బాగా నచ్చాయి. టెక్నీషియన్స్ అంతా ఎమోషనల్ ఇన్వెస్ట్ మెంట్ చేసినట్లు తెలుస్తోంది. అనురాగ్ నాకు మంచి మిత్రులు. కల్యాణ్ ఈ కథను నాకు గతంలో నెరేట్ చేశారు. మంచి స్టోరీ ఇది. ఈ టీమ్ అందరికీ సక్సెస్ రావాలని కోరుకుంటున్నా. అన్నారు.
హీరో ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ – ఈ గ్లింప్స్ చూస్తున్నప్పుడు మ్యూజిక్ నన్ను బాగా ఇంప్రెస్ చేసింది. ఓషో వెంకట్ తో కలిసి ఫ్యూచర్ లో వర్క్ చేయాలని అనుకుంటున్నా. రాంప్రసాద్ గారు ఇచ్చిన విజువల్స్ అమేజింగ్ గా ఉన్నాయి. విజువల్స్ తోనే ఇదొక మాస్ కమర్షియల్ మూవీ అనే ఫీల్ వచ్చింది. కల్యాణ్ అన్న బ్యూటిఫుల్ సాంగ్స్ రాస్తారు. మా బేబి మూవీలో కూడా పాట రాశారు. ఈ చిత్రంలో ఆయన ఎలాంటి డైలాగ్స్ రాస్తాడో చూడాలనుకుంటున్నా. అరవింద్, అర్చన, హారిక వాళ్ల కెరీర్ లో ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నా. మా ఫ్యామిలీకి చాలా దగ్గరైన వ్యక్తి అనురాగ్. ఆయన ఈ సినిమాతో సాధించే విజయం మా అందరినీ గర్వపడేలా చేస్తుంది. అన్నారు.
ప్రొడ్యూసర్ దిల్ రాజు మాట్లాడుతూ – ఈ బ్యానర్ కు తగినట్లే ప్రొడ్యూసర్ కు మంచి లాభాలు తీసుకొచ్చే సినిమా కావాలి. కొత్త దర్శకుడు కల్యాణ్ చక్రవర్తి ఈ సినిమాతో టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలి. ఆయన రైటర్ గా మంచి పేరు తెచ్చుకున్నారు. ఇందాక శివాజి చెప్పాడు చాలా మంచి స్టోరీ అని. ఈ యంగ్ టీమ్ చేస్తున్న ప్రయత్నం సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. అందరికీ ఆల్ ది బెస్ట్. అన్నారు.
డైరెక్టర్ బోయపాటి శ్రీను మాట్లాడుతూ – నా దగ్గర ట్రైనింగ్ అయ్యి, నాతో ఎన్నో మూవీస్ కు వర్క్ చేసిన నా టీమ్ వ్యక్తి కల్యాణ్ డైరెక్టర్ అయ్యాడు అని చెప్పేందుకు ఈ ఈవెంట్ కు వచ్చాను. ఈ సినిమాకు వర్క్ చేసిన రాంప్రసాద్ , ఓషో వెంకట్..ఇలా చాలా మంది నాతో జర్నీ చేసిన వాళ్లే. ఈ పరిశ్రమ మొత్తం ఒక టీమ్ అని చెప్పాలనుకుంటున్నా. ఏ డైరెక్టర్ అయినా తను నమ్మిందే తెరకెక్కించాలని అనుకుంటాడు. ఆ క్లారిటీ ఉన్నప్పుడే దర్శకుడు సక్సెస్ అవుతాడు. నా సినిమాలకు పాటలతో పాటు స్క్రిప్డ్ డిస్కషన్స్ లో పనిచేసిన వ్యక్తి కల్యాణ చక్రవర్తి. ఆయన ఒక మంచి సినిమానే మన ముందుకు తీసుకొస్తాడనే నమ్మకం ఉంది. ఈ గ్లింప్స్ తోనే అది ప్రూవ్ అవుతోంది. గ్లింప్స్ చూస్తే సినిమాలో ఏది ఎంత ఉండాలో అంత ఉంది. అరవింద్ పర్ ఫార్మెన్స్ లో ఇంపాక్ట్ ఉంది. ఆడియెన్స్ ను కట్టిపడేసే ఎక్స్ ప్రెషన్స్ చూపించారు. నీరోతో ఒక మంచి హీరో వచ్చాడనే పేరు అరవింద్ కు, ఆ హీరోను తీసుకొచ్చాడనే పేరు కల్యాణ చక్రవర్తికి రావాలి. అరవింద్ కు బ్రైట్ ఫ్యూచర్ ఉంది. అనురాగ్ గారి ఈ సినిమాకు చేసిన ప్రొడక్షన్ వ్యాల్యూస్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒక పాటనే అంత అందంగా అర్థవంతంగా రాసే కల్యాణ చక్రవర్తి…రెండు గంటలు పైగా నిడివి ఉండే సినిమాను ఎంత బాగా చేసి ఉంటాడో అర్థం చేసుకోవచ్చు. ఆ రిజల్ట్ మనం థియేటర్స్ లో చూస్తాం. అన్నారు
నటీనటులు – అరవింద్, అర్చన అయ్యర్, హారిక నారాయణ్, శివాజి, ప్రవీణ్, రఘు కుంచె, అశ్రిత వేముగంటి, దీప్తి నల్లమోతు, తదితరులు
టెక్నీషియన్స్
——————–
వీఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ – రాఘవ్ తమ్మారెడ్డి
ఆర్ట్ డైరెక్టర్ – జి.ముని శేఖర్
ఫైట్ మాస్టర్ – రామ్ క్రిషన్
డైలాగ్ రైటర్ – అశోక్ పొడపాటి
ఎడిటర్ – నిరంజన్ దేవరమనె
మ్యూజిక్ డైరెక్టర్ – ఓషో వెంకట్
సినిమాటోగ్రఫీ – సి.రామ్ ప్రసాద్
పబ్లిసిటీ డిజైనర్ – అనంత్ కంచెర్ల
ప్రొడ్యూసర్ – అనురాగ్ పర్వతనేని
స్క్రిప్ట్, డైరెక్షన్ – కల్యాణ్ చక్రవర్తి త్రిపురనేని
పీఆర్ఓ – సురేష్ (ఎస్ కే మీడియా)

