కిరణ్ అబ్బవరం, దేవిక భట్, సుధాకర్ చాగంటి, జాయ్ ఫిల్మ్స్ ‘రియాలిటీ’ నుంచి వెడ్డింగ్ సీజన్…
కాకినాడలో ‘రియాలిటీ’ నుంచి సంగీత్ సాంగ్ లాంచ్ ఈవెంట్
ప్రామిసింగ్ హీరో కిరణ్ అబ్బవరం తన ప్రతిష్టాత్మక చిత్రం ‘రియాలిటీ’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాలో హీరోగా నటించడంతో పాటు రచయితగా, దర్శకత్వం వహిస్తున్నారు. తన కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని జాయ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై సుధాకర్ చాగంటి నిర్మిస్తున్నారు. సురేష్ యెర్రా కో-ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే సినిమా ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. గ్లింప్స్‌కు మంచి స్పందన రాగా, తొలి రెండు పాటలు చార్ట్‌బస్టర్స్‌గా నిలిచి సంగీత ప్రియులను ఆకట్టుకున్నాయి. ఇప్పుడు వెడ్డింగ్ సీజన్‌లో మరో గ్రాండ్ సెలబ్రేషన్‌కు ‘రియాలిటీ’ సిద్ధమైంది.
మ్యూజికల్ ప్రమోషన్స్‌ను కొనసాగిస్తూ మేకర్స్ తాజాగా సినిమాలోని సందడిగా సాగే సంగీత్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. కాకినాడలో ఘనంగా జరిగిన ఈవెంట్ లో సాంగ్ ను లాంచ్ చేశారు.
పెళ్లి వేడుకల్లో ఉండే పండగ వాతావరణాన్ని ఈ పాటలో అందంగా చూపించారు. భీమ్స్ సిసిరోలియో అదిరిపోయే బీట్స్‌తో హై ఎనర్జీ పార్టీ ట్రాక్‌ను అందించారు. కిరణ్ అబ్బవరం తన సాంగీత్ వేడుకకు అతిథులను ఆహ్వానించడంతో పాట ప్రారంభమవుతుంది. పెద్దవాళ్ల నుంచి యువత వరకు అన్ని వయసుల వారు ఈ వేడుకలో భాగం కావడంతో పాట మొదటి నుంచే సందడి వాతావరణం నెలకొంటుంది.
సురేష్ గంగుల రాసిన ఈ పాటలో సంగీత్ వేడుకల్లో ఉండే అసలైన సరదా, అల్లరి కనిపిస్తుంది. జంట మధ్య సరదా ఆటపట్టింపులు, బావా మరదళ్ల మధ్య చిలిపి సరదాలు, యూత్‌ఫుల్ అల్లరి, ఎనర్జిటిక్ డ్యాన్స్‌లు, పెళ్లి వేడుకల్లో ఉండే ఆనందాన్ని పాటలో చక్కగా చూపించారు. భీమ్స్ సిసిరోలియో తన మ్యూజిక్ మాడ్యులేషన్స్‌తో పాటను ఆద్యంతం కలర్‌ఫుల్‌గా, ఎంటర్‌టైనింగ్‌గా మలిచారు.
వేదవతి భాగవతరిణి, కుంచె రఘు, రోహిణి సొర్రాట్, శ్రీకృష్ణ, సాహితి చాగంటి, నల్గొండ నర్సన్న ఈ పాటకు వోకల్స్ అందించారు. వీరి ఎనర్జిటిక్ వాయిస్ పాటలోని సెలబ్రేషన్ మూడ్‌ను మరింత పెంచింది. బీట్‌కు తగ్గట్టుగా వారి వాయిస్ పాటను వెంటనే కనెక్ట్ అయ్యేలా చేస్తుంది.
విజయ్ పొలాకి కొరియోగ్రఫీ సంగీత్ వేడుకల బ్యాక్‌డ్రాప్‌కు చక్కగా కుదిరింది. కుటుంబంలోని అందరూ డ్యాన్స్‌లు చేస్తూ వేడుకలో భాగం కావడం పాటకు మరింత విజువల్ అప్పీల్ తీసుకొచ్చింది. కిరణ్ అబ్బవరం, దేవిక భట్ వేడుకలకు లీడ్ చేయగా, పూజిత పొన్నాడ కూడా డ్యాన్స్‌లో జాయిన్ అయ్యారు. సాయి కుమార్, రోహిణి, అన్నపూర్ణమ్మ కూడా స్టెప్పులు వేస్తూ సందడి చేశారు. దీంతో ఈ పాట ఒక అందమైన ఫ్యామిలీ సెలబ్రేషన్‌లా మారింది.
పెప్పీ బీట్స్, కలర్‌ఫుల్ విజువల్స్, ఎంటర్‌టైనింగ్ కొరియోగ్రఫీ, కుటుంబ సభ్యుల సందడితో రూపొందిన ఈ సాంగ్ పెళ్లిళ్లు, సంగీత్ వేడుకలు, ప్రీ-వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌లో బెస్ట్ చాయిస్ గా నిలవనుంది.
ఈ చిత్రానికి విశ్వాస్ డేనియల్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్నారు. సుధీర్ మాచర్ల ప్రొడక్షన్ డిజైన్ చూస్తుండగా, సంతోష్ నాయుడు ఎడిటర్‌గా, రాజేష్ కామారసు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు.
‘రియాలిటీ’ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25, 2026న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ కానుంది.
నటీనటులు: కిరణ్ అబ్బవరం, దేవిక భట్, శరత్ కుమార్, సాయి కుమార్, రోహిణి, అన్నపూర్ణమ్మ, సుదర్శన్
టెక్నికల్ టీమ్:
రచన, దర్శకత్వం: కిరణ్ అబ్బవరం
నిర్మాత: సుధాకర్ చాగంటి
బ్యానర్: జాయ్ ఫిల్మ్స్
కో-ప్రొడ్యూసర్: సురేష్ యెర్రా
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
సినిమాటోగ్రఫీ: విశ్వాస్ డేనియల్
ప్రొడక్షన్ డిజైనర్: సుధీర్ మాచర్ల
ఎడిటర్: సంతోష్ నాయుడు
కాస్ట్యూమ్ డిజైనర్: రాజేష్ కామారసు
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: వాల్స్ అండ్ ట్రెండ్స్

