Skip to content

‘కనకదుర్గ’.. భారీ పోస్ట్ థియేట్రికల్ మూవీ లైనప్‌లో భాగంగా ప్రకటించిన Z5 తెలుగు

బిర్లా స్టూడియోస్, టెంపుల్ టౌన్ పిక్చర్స్ సంయుక్తంగా రూపొందిస్తోన్న‌ అత్యంత ఆసక్తికర భక్తి ప్రధాన చిత్రం ‘కనకదుర్గ’. ఈ చిత్రం Z5 తెలుగు భారీ పోస్ట్ థియేట్రికల్ ఫిల్మ్ లైనప్‌లో చోటు దక్కించుకుంది. దైవత్వం యొక్క అద్భుతమైన శక్తిని ప్రతిబింబించే ఓ పవర్‌ఫుల్ కథతో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఆసక్తికరమైన క్రియేటివ్ కలయికగా నిలుస్తోంది. అల్లరి నరేష్, కాజల్ చౌదరి ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న ఈ చిత్రానికి ప్రదీప్ మద్దాలి దర్శకత్వం వహిస్తుండగా.. బీవీఎస్ రవి కథను అందిస్తున్నారు. మ్యూజిక‌ల్ సెన్సేష‌న‌ల్ ఎస్. థమన్ సంగీతాన్ని స‌మ‌కూరుస్తున్నారు. భక్తి, యాక్షన్, భావోద్వేగాలు, సంగీతం.. ఇలా అన్ని అంశాల సమ్మేళనంగా రూపొందుతోన్న ‘కనకదుర్గ’ చిత్రం, సర్వశక్తిమంతమైన శ్రీ కనకదుర్గ అమ్మవారి దివ్యశక్తి, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత…

Read more
అల్లరి నరేష్ ‘కనక దుర్గ’ ఘనంగా ప్రారంభం Telugu News

అల్లరి నరేష్ ‘కనక దుర్గ’ ఘనంగా ప్రారంభం

తమిళ సినీ ఇండ‌స్ట్రీలో విజ‌య‌వంత‌మైన ప్రముఖ కంటెంట్ స్టూడియో అప్లాజ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఇప్పుడు టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అందులో భాగంగా టెంపుల్ టౌన్ పిక్చ‌ర్స్‌తో క‌లిసి చేయ‌బోతున్న సినిమా ‘కనక దుర్గ’ను శ‌నివారం రోజున పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభించారు. వెర్స‌టైల్ స్టార్ అల్ల‌రి న‌రేష్ హీరోగా న‌టిస్తోన్న ఈ సినిమాలో కాజ‌ల్ చౌద‌రి హీరోయిన్‌. ఈ సినిమాలో న‌టుడు సుబ్బ‌రాజు కీల‌క పాత్ర పోషిస్తున్నారు. ఈ భక్తి ప్రధాన కథా చిత్రానికి బి.వి.ఎస్. రవి కథ అందిస్తుండ‌గా..ప్రదీప్ మద్దాలి దర్శకత్వం వహిస్తున్నారు. స‌మీర్ నాయ‌ర్‌, దీపక్ సెహ‌గ‌ల్‌, అజిత్ ఠాకూర్‌, బి.వి.ఎస్‌.ర‌వి నిర్మాత‌లు. భారతీయ దేవతల ఆధారంగా ఒక దివ్యమైన ప్రపంచాన్ని ఆవిష్క‌రిస్తూ ఈ సినిమా భక్తి, యాక్షన్, భావోద్వేగాలు, సంగీతం ఇలా…

Read more