మహా యోధుడు కర్ణుడిగా రాఘవ లారెన్స్
పెన్ మూవీస్ అధినేత జయంతిలాల్ గడా సమర్పణలో.. ఆర్‌వీ స్టూడియోస్, శ్రీ నీలాద్రి ప్రొడక్షన్స్ అసోసియేషన్‌లో.. దర్శకుడు రమేష్ వర్మ నుంచి ఐదు భాషల్లో తెరకెక్కుతోన్న భారీ పాన్ ఇండియా ఎపిక్ ‘కర్ణ’. ఇండియన్ సిల్వర్ స్క్రీన్‌పై మహాభారతంలోని మహావీరుడు కర్ణుడి మహాగాథ మరోసారి ఆవిష్కృతం కానుంది. ఈ మహా యోధుడి పాత్రలో ప్రముఖ నటుడు రాఘవ లారెన్స్ నటిస్తున్నారు. దర్శకుడు రమేష్ వర్మ తనదైన విజన్‌తో ఈ పురాణగాథను భారీ స్థాయిలో వెండితెరపై ఆవిష్కరిస్తున్నారు. రూ.150 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రం తెలుగు, తమిళ, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో రూపొందుతోంది. ఐదు భాషల్లో తెరకెక్కుతోన్న ఈ ప్రతిష్టాత్మక ఎపిక్.. అత్యున్నత నిర్మాణ విలువలు, భారీ సాంకేతిక ప్రమాణాలతో…
