Skip to content

సెప్టెంబర్ 25న ‘అవెంజర్స్ ఎండ్‌గేమ్: ఎంకోర్’తో మరోసారి గ్రాండ్ రిలీజ్

మార్వెల్ అభిమానులకు మరోసారి బిగ్ స్క్రీన్‌పై అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ అందించేందుకు మార్వెల్ స్టూడియోస్ సిద్ధమైంది. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన *‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’*కు ప్రత్యేకమైన ఎంకోర్ ప్రదర్శనగా ‘అవెంజర్స్ ఎండ్‌గేమ్: ఎంకోర్’ సెప్టెంబర్ 25, 2026న భారతదేశంలోని థియేటర్లలో విడుదల కానుంది. ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు భాషల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే ఐమాక్స్ ®తో పాటు మార్వల్ Studios Presents ఇన్ఫినిటీ విజన్ సర్టిఫైడ్ ప్రీమియం లార్జ్ ఫార్మాట్ (PLF) స్క్రీన్స్‌లోనూ ఈ స్పెషల్ ప్రెజెంటేషన్ అందుబాటులో ఉంటుంది. పెద్ద స్క్రీన్స్, మరింత ప్రకాశవంతమైన విజువల్స్, అత్యుత్తమ సౌండ్‌తో ప్రేక్షకులకు మరింత గొప్ప థియేట్రికల్ అనుభూతిని అందించనుంది. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్‌లోని ఇన్ఫినిటీ సాగాకు మహత్తర ముగింపుగా…

Read more

‘స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ ఫైనల్ ట్రైలర్ విడుదల

మార్వెల్ స్టూడియోస్ తెరకెక్కించిన 'స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే' సినిమా ఫైనల్ ట్రైలర్ విడుదలైంది. టామ్ హాలండ్ స్పైడర్-మ్యాన్‌గా నటిస్తున్న నాలుగో సోలో సినిమా ఇది. ఈ చిత్రం జూలై 30న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ ట్రైలర్‌లో 'స్పైడర్-మ్యాన్: నో వే హోమ్' తర్వాత జరిగిన సంఘటనలను చూపించారు. అందరి జ్ఞాపకాల నుంచి పీటర్ పార్కర్ పూర్తిగా మాయమైన తర్వాత అతను ఒంటరిగా ఎలా జీవిస్తున్నాడో చూపించారు. అలాగే తన ప్రేమికురాలు ఎంజే (జెండయా)తో గడిపిన మధుర క్షణాలను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యే సన్నివేశాలు ట్రైలర్‌లో ఉన్నాయి. దీంతో ఈ సినిమా ఎమోషనల్‌గా ఉండబోతుందనే విషయం మరోసారి స్పష్టమైంది. అలాగే ఈ ట్రైలర్‌లో మార్క్ రఫాలో హల్క్ పాత్రలో…

Read more

‘అవెంజర్స్: డూమ్స్‌డే’ ట్రైలర్ విడుదల

మార్వెల్ స్టూడియోస్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'అవెంజర్స్: డూమ్స్‌డే' చిత్ర ట్రైలర్‌ను విడుదల చేసింది. ఈ సినిమా డిసెంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. భారత్‌లో ఈ చిత్రం ఇంగ్లీష్, హిందీ, తమిళ్, తెలుగు భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదలైన ట్రైలర్‌లో థోర్, కెప్టెన్ అమెరికా, ఫాంటాస్టిక్ ఫోర్, బ్లాక్ పాంథర్ వంటి ప్రముఖ మార్వెల్ సూపర్ హీరోలు ఒకే కథలో కనిపించనున్నట్లు చూపించారు. అలాగే ఎక్స్-మెన్ ప్రపంచానికి చెందిన ప్రొఫెసర్ ఎక్స్ (పాట్రిక్ స్టీవర్ట్), మ్యాగ్నెటో (ఇయాన్ మెక్‌కెలెన్), సైక్లోప్స్ (జేమ్స్ మార్స్‌డెన్) కూడా ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రంలో మరో ప్రధాన ఆకర్షణ రాబర్ట్ డౌనీ జూనియర్. గతంలో ఐరన్ మ్యాన్‌గా అలరించిన…

Read more