ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్‌తో ‘జో జో’
కృష్ణ కమల్ , మహి హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న రూరల్ కామెడీ డ్రామా ‘జో జో’. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమా ప్రముఖ దర్శకుడు దేవకట్టా సమర్పణలో కిరణ్ జయ్ కుమార్ దర్శకుడిగా రూపొందుతోంది. విజయం బ్యానర్‌పై విజయ్ కృష్ణ లింగమనేని ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వైవిధ్యమైన చిత్రాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్న ఈ క్రమంలో ‘జో జో’ సినిమా ఆడియెన్స్‌ను అలరించటానికి సిద్ధమైంది. సోమవారం కాషన్ 1 పేరుతో ఈ సినిమా కంటెంట్ ఏంటనే విషయాన్ని తెలియజేస్తూ ఓ వీడియో గ్లింప్స్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. రాయలసీమలోని జొన్నగిరి నేపథ్యంలో తెరకెక్కుతోన్న సినిమా. వర్షాలు పడినప్పుడు అక్కడ వజ్రాలు దొరుకుతాయనే వార్తలు మనం వినే ఉంటాం. ఆ పాయింట్‌ను ఆధారంగా…
