‘ది ప్యారడైజ్’ చిత్రాన్ని వీక్షించిన బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
చిత్రబృందంపై ప్రశంసల జల్లు! తెలంగాణ నేల, భాష, సంస్కృతిని అద్భుతంగా ఆవిష్కరించిన దృశ్య కావ్యం: కేటీఆర్ అణచివేతపై ప్రజల పోరాటాన్ని కళ్లకు కట్టారు; ఈ చిత్రానికి ప్రేరణ ఎవరో అందరికీ తెలిసిందేనని వ్యాఖ్య భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులతో కలిసి హైదరాబాద్‌లోని సుదర్శన్ థియేటర్‌లో హీరో నాని నటించిన తాజా చిత్రం ‘ది ప్యారడైజ్’ (దర్శకత్వం: శ్రీకాంత్ ఓదెల) ప్రత్యేక ప్రదర్శనను వీక్షించారు. అనంతరం థియేటర్ వద్ద మీడియాతో మాట్లాడిన ఆయన సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా కేటీఆర్ గారు మాట్లాడుతూ: "సమాజంలో అణచివేత ఎదురైనప్పుడు ఆ సమాజం తన అస్తిత్వం కోసం చేసే పోరాటం, న్యాయం కోసం…
