టికెట్ టు హెల్ ని ప్రేక్షకులకు అందిస్తున్న టాక్సిక్ మేకర్స్
‘టాక్సిక్’ మేకర్స్ నుంచి ‘టికెట్ టు హెల్’ – రాకింగ్ స్టార్ యష్ ట్రాన్స్‌ఫార్మ్ అయిన రెండో లుక్ విడుదల ‘టాక్సిక్: ఎ ఫెయిరీ’ టేల్ ఫర్ గ్రోన్-అప్స్ చిత్ర నిర్మాతలు మరోసారి ఇంటర్నెట్‌ను షేక్ చేశారు — ఈసారి ప్రేక్షకులకు ‘టికెట్ టు హెల్’ని అందించారు. తాజాగా విడుదలైన స్ట్రైకింగ్ పోస్టర్‌లో రాకింగ్ స్టార్ యష్ ఎవరూ ఊహించని కొత్త అవతారంలో కనిపిస్తున్నారు. ఈ క్లీన్-షేవ్ లుక్ పోస్టర్‌లో యష్ పోషిస్తున్న మరో పాత్ర ‘టికెట్’ను పరిచయం చేశారు — ఇది చిత్రంలోని ఆయన రెండో లుక్. వీటిని బట్టి చూస్తుంటే గ్రిప్పింగ్ డబుల్ రోల్ తో అద్భుతమైన కథ సిద్ధమైనట్టు అర్థమవుతోంది. ఇంతకుముందు విడుదలైన యష్ గడ్డం లుక్ ‘రాయా’…
